Health Tips: నిద్రలో అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుందా? కారణం ఇదే.. తస్మాత్‌ జాగ్రత్త!

Health Tips: నిద్రలో అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుందా? కారణం ఇదే.. తస్మాత్‌ జాగ్రత్త!


నిద్ర లేమికీ, శారీరక మానసిక ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించి అవగాహన ఏర్పడవలసిన అవసరాన్ని గతంలో కరోనా మహమ్మారి తెలియజేసింది. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి ఒక్కరికి నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరికి సరైన నిద్ర లేకుంటే డయాబెటిస్‌తో పాటు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వంటివాటికి కారణం కావచ్చు.

గొంతులో కండరాలు:

నిద్రిస్తున్న సమయంలో గొంతు భాగంలో ఉన్న కండరాలు ఎక్కువగా రిలాక్స్ అవుతాయి. దీంతో నాలుక లేదా టాన్సిల్స్ లాంటి మృదు కణ జాలాలు ఉండే భాగాలు గాలి వెళ్లే ద్వారాన్ని అడ్డుకుంటాయి. దీన్నే అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా అంటాం. ఈ బ్లాకేజీ కండిషన్​ కొన్ని సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు ఉంటుంది. ఈ సమయంలో మెదడుకు ఆక్సిజన్ తక్కువ అందుతుంది. అలాగే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. ఇది కొన్ని క్షణాలపాటే ఉండడం వల్ల దీనిని పెద్దగా ఎవరు గమనించి ఉండదరు. ఇది గాఢనిద్రలోకి వెళ్లకుండా అప్పుడప్పుడు అకస్మాత్తుగా మెలకువ వస్తూ ఉంటుంది. తద్వారా శరీరానికి సరిపడా నిద్ర ఉండదు. ఊపిరి తీసుకోవడంలో కలిగే ఈ ఇబ్బందులు లేదా ఆప్నియాలు ఒక్కరాత్రిలోనే పది నుంచి వందలసార్లు కూడా వస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Maruti Car: అత్యంత చౌకైన ఈ కారు ధర రూ. 4.23 లక్షలు.. 6 ఎయిర్‌ బ్యాగులు!

నిద్రించేటప్పుడు గురుక:

చాలా మందికి నిద్రలో గురక వస్తుంటుంది. దీని వల్ల చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దాంతో పక్కనవాళ్లు ఇబ్బంది పడడం సహజం. కానీ, గురక వల్ల ఎంతసేపు నిద్రపోయినా వాళ్లకు విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించదు. కానీ, ఈ సమస్యను చాలామంది గుర్తించరు. తమంతట తాముగా గుర్తించలేరు కూడా. దీనిని అబ్​స్ట్రక్టివ్​ స్లీప్ ఆప్నియా (ఒఎస్​ఎ) అంటారు.

నిద్రకు భంగం:

ఇది నిశబ్దంగా మన నిద్రను భంగం కలిగిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక అలసటకు దారితీస్తుంది. శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు వెంటనే మెలకువ వచ్చేస్తుంది. సరైన నిద్ర లభించదు. ఫలితంగా, పొద్దున్నే లేచిన తర్వాత తలనొప్పిగా ఉండడం, నీరసం, మూడ్ సరిగా ఉండకపోవడం, డిప్రెషన్ వంటివి కూడా కలుగవచ్చు. నిద్ర లేమి సమస్య పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ తో చేసే పనుల్లో సామర్ధ్యం తగ్గుతుందని తెలుస్తోంది. పైగా రోజులు గడిచే కొద్దీ ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు మున్ముందు మరిన్ని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని, ఇదో సంకేతామని వైద్యులు చెబుతున్నారు. కానీ మన శరీరంలో అప్పుడప్పుడు ఏర్పటే సంకేతాలను అర్థం చేసుకుంటే జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *