చిన్న జేబు ఎందుకు ఉంటుంది?: సాధారణంగా ప్రతి జీన్స్ ప్యాంట్‌కు పైనే ఓ చిన్న జేబు ఉంటుంది. అది ఎందుకు ఉంటుందోనని పెద్దగా పట్టించుకోరు. ఈ జేబు ఉండటం వెనుక కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం. జీన్స్ ప్యాంట్‌ను శ్రామిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే రైల్వే ఉద్యోగులు, వడ్రంగి కార్మికులు, మైనింగ్ కార్మికులు. ఆ సమయంలో కార్మికుల సౌకర్యం కోసం మందపాటి వస్త్రం, చిన్న పాకెట్స్ ఉన్న జీన్స్ తయారు చేశారు. దీని వెనుక కారణం ఏంటంటే, 19వ శతాబ్దంలో ఉపయోగించిన గడియారాలకు బెల్టులు లేవు. అంతేకాకుండా వాటి డయల్స్ కూడా చిన్నవిగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వాటిలో జేబులో ఉంచుకుంటే కిందపడి పగిలిపోయే అవకాశం ఉంది. దీంతో వాచ్ సురక్షితంగా ఉండేందుకు ఈ జీన్స్ ప్యాంట్‌కు చిన్నపాటి ప్యాకెట్‌ల ఉండే జేబును తయారు చేశారట.