EB-5 VISA: షాకుల మీద షాకులు ఇస్తున్న ట్రంప్.. ‘గోల్డెన్’ ఛాన్స్ కోసం ఎగబడుతున్న భారతీయులు

EB-5 VISA: షాకుల మీద షాకులు ఇస్తున్న ట్రంప్.. ‘గోల్డెన్’ ఛాన్స్ కోసం ఎగబడుతున్న భారతీయులు


అమెరికాలో సెటిల్ కావాలనుకున్న భారతీయులకు ట్రంప్‌ షాకుల మీద షాకులు ఇస్తుండగా.. భారతీయులు మాత్రం USలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి పేరుతో పొందే వీసాలకు క్యూ కడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం భారతీయులు వెనకడుగు వేయడం లేదు. ఉద్యోగాలకు అవసరమైన హెచ్‌1బీ వీసాలు రావడం కష్టంగా మారినా.. వ్యాపారానికి అవసరమైన ఈబీ-5 వీసాలకు మాత్రం డిమాండ్‌ తగ్గలేదని లెక్కలు చెబుతున్నాయి.

ఈబీ-5 దరఖాస్తుల డేటాను పరిశీలిస్తే.. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్‌ నుంచి భారతీయుల్లో ఈబీ-5 వీసాకు ఆదరణ పెరిగింది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఇమిగ్రేషన్‌ ఫండ్‌ డేటా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయుల నుంచి 12వందలకు పైగా ఈబీ-5 పిటిషన్లు వచ్చా్యంటున్నారు అధికారులు.

ఇతర రకం వీసాల జారీలో పెద్ద సంఖ్యలో బ్యాక్‌లాగ్‌ ఉండటంతో ఈబీ-5కు డిమాండ్‌ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హెచ్‌1బీ, గ్రీన్‌కార్డ్‌ల జారీ కష్టంగా మారడం కూడా దీనికి కారణమైంది. ఇప్పటివరకు ఇమిగ్రేషన్‌ సంస్థ దగ్గర దాదాపు కోటి 10లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనేపథ్యంలో వేగంగా లభించే ఈబీ-5ను అమెరికా శాశ్వత నివాసానికి మార్గంగా ఎంచుకుంటున్నారు భారతీయులు. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ ది యూఎస్‌ఏ’ సంస్థ లెక్కల ప్రకారం 2024లో భారతీయులకు 14వందల 28 ఈబీ-5 వీసాలను జారీ చేశారు. 2023లో ఈ సంఖ్య కేవలం 815 మాత్రమే ఉంది. ఈబీ-5 వీసాలను.. ట్రంప్‌ ప్రకటించిన విధంగా.. గోల్డ్‌ కార్డులతో భర్తీ చేయనుండటంతో డిమాండ్ ఇంకాస్త పెరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *