ఇంట్లో ఎలుకల బెడదతో విసిగెత్తిపోయారా? చంపకుండా తరిమికొట్టే చిట్కాలివో..

ఇంట్లో ఎలుకల బెడదతో విసిగెత్తిపోయారా? చంపకుండా తరిమికొట్టే చిట్కాలివో..


బల్లులు, బొద్దింకల బెడదలాగే, ఎలుకలు కూడా చాలా ఇళ్లలో సంచరిస్తూ ఉంటాయి. బొద్దింకలతో పోలిస్తే ఎలుకలు చాలా ప్రమాదకరమైనవి. అవి కిరాణా సామాగ్రిని, ధాన్యాలను పాడుచేయడమే కాకుండా బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా పాడు చేస్తాయి. వీటి బెడద నుంచి బయటపడటానికి, చాలా మంది ఆహారంలో విషాన్ని కలిపి వాటికి వేస్తారు. కానీ కొన్నిసార్లు ఎలుకల కోసం ఉంచిన ఈ ఆహారాలను ఇంట్లోని పెంపుడు జంతువులు తిని ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఎలుకలను చంపకుండా వాటిని ఇంటి నుంచి ఎలా తరిమికొట్టాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం ఈ సింపుల్‌ చిట్కాలు..

ఎలుకల బెడద నుంచి బయటపడటానికి సులభమైన చిట్కాలు ఇవే..

కర్పూరం

ఎలుకలను తరిమికొట్టడంలో కర్పూరం ప్రభావవంతంగా ఉంటుంది. మీ ఇంట్లో కర్పూరం ఉంటే ఇంట్లో ఎలుకల సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. కర్పూరం వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఎలుకలు దీని వాసనను ఇష్టపడవు. కాబట్టి ఇంటి ప్రతి మూలలో కర్పూరం ఉంచినా.. లేదంటే కర్పూరం వెలిగించి దాని పొగను ఇంట్లో ఉంచినా ఎలుకలు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి.

బే ఆకు

బే ఆకు లేదా బిర్యానీ ఆకు గురించి తెలియని వారుండరు. ఇవి ఎలుకలను తరిమికొట్టడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. ఎలుకలు దాని ఘాటైన వాసనను ఇష్టపడవు. కాబట్టి ఇంట్లో ఎలుకలు సంచరించే ప్రదేశంలో 8-10 బే ఆకులను ఉంచితే సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. దీని వాసన ఎలుకలను ఇంటి దరిదాపులకు రాకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క

ఈ మసాలా దినుసు వంట రుచిని పెంచడమే కాకుండా ఎలుకలను తరిమికొట్టడానికి సమర్థవంతమైన ఇంటి నివారణగా కూడా పనిచేస్తుంది. దీని కోసం, ముందుగా దాల్చిన చెక్క పొడిని తయారు చేసి, ఇంటి ప్రతి మూలలో ఉంచాలి. ఎలుకలు దాని వాసన భరించలేక అక్కడి నుంచి పారిపోతాయి.

వెల్లుల్లి – నల్ల మిరియాలు

ఎలుకలు వెల్లుల్లి, నల్ల మిరియాలు వాసనను కూడా ఇష్టపడవు. ఇంటి నుండి ఎలుకలను తరిమికొట్టడానికి వెల్లుల్లి, నల్ల మిరియాలు రుబ్బి, వాటిని ఉండగా చేసి ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రాంతంలో ఉంచాలి.

పుదీనా, లవంగం

ఎలుకలు పుదీనా, లవంగం వాసనను కూడా ఇష్టపడవు. కాబట్టి ఇవి ఎలుకలను తరిమికొట్టడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీ ఇంట్లో ఎలుకలు సంచరించే ప్రదేశాలలో పుదీనా ఆకులు, లవంగాలను ఉంచాలి. వీటి ఘాటైన వాసన ఎలుకలను పారిపోయేలా చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *