Telangana: తెలంగాణకు గుడ్ న్యూస్.. కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి 2 క్రిటికల్ మినరల్ రీసెర్చ్ సెంటర్స్

Telangana: తెలంగాణకు గుడ్ న్యూస్.. కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి 2 క్రిటికల్ మినరల్ రీసెర్చ్ సెంటర్స్


ఐటీ, స్టార్టప్‌లు, బయోటెక్, రీసెర్చ్‌… ఏ ఫీల్డ్ తీసుకున్నా హైదరాబాద్ పేరు వినిపించకమానదు. ఇప్పుడు అదే హైదరాబాద్‌కి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలోనే అత్యవసరంగా కావాల్సిన కీలక ఖనిజాలపై జరగనున్న రీసెర్చ్‌కు కేంద్ర ప్రభుత్వం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఆ ఏడింటిలో రెండు మన హైదరాబాద్‌కు రానున్నాయి. అందులో ఒకటి – IIT హైదరాబాద్ కాగా.. మరొకటి హకింపేట్‌లో గల – NFTDC (Non-Ferrous Technology Development Centre).

ఇప్పుడున్న టెక్నాలజీతో పాటు… ఫ్యూచర్‌కి కావాల్సిన ఎనర్జీ, బ్యాటరీలు, స్పేస్‌ లాంచ్‌లు, డిఫెన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఓ ప్రత్యేకమైన మినరల్స్‌ మీదే ఆధారపడి ఉన్నాయి. వాటినే క్రిటికల్ మినరల్స్ అంటారు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే… వాళ్లదే ఆధిపత్యం. ఇలాంటి సెన్సిటివ్ ఫీల్డ్‌లో భారత్ వెనుకబడితే… బంగారం ఉన్నా బలహీనంగా మారిపోతుంది. అందుకే దీన్ని ప్రైయారిటీ చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌ కింద రూ16,300 కోట్లు బడ్జెట్ పెట్టారు. మరో రూ.18,000 కోట్లు పీఎస్‌యూల నుంచి తీసుకోనున్నారు. మొత్తం దేశాన్ని కవర్ చేసేందుకు ఏడేళ్ల ప్లానింగ్ రెడీగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగానే దేశవ్యాప్తంగా 7 సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. IITలు, సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్లతో కలిసి హార్డ్‌కోర్ సీసెర్చ్ చేయాలనుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా కలిపి 7 సెంటర్లు ఏర్పాటు జరుగుతుంటే.. అటువంటి ముఖ్యమైన పరిశోధనా కేంద్రాల్లో రెండు మన తెలంగాణకే వచ్చాయంటే కారణం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ మొదలుపెట్టిన దగ్గరి నుంచి… హైదరాబాద్‌లో రెండు సెంటర్లు కావాలంటూ కేంద్రంలో ప్రతి స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌లోని IIT, NFTDC ల సామర్థ్యాన్ని ఢిల్లీ ముందుంచి, కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించారు.. దేశ భద్రత, ఎనర్జీ భద్రత, స్పేస్ రంగాలు వంటి మల్టీ బిలియన్ డాలర్ టెక్ రంగాల్లో ముందుకు వెళ్లాలంటే, ఈ రిసెర్చ్ సెంటర్లు ఎంత అవసరమో తెలిసిన వ్యక్తి కిషన్ రెడ్డి. ఒకవైపు పరిశోధనకు అవకాశాలు తెచ్చేలా చూస్తే… మరోవైపు తెలంగాణ విద్యార్థులకు గేట్‌వేలు తెరుస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు బలాన్ని ఇస్తున్నారు.

కాగా ఐఐటీ హైదరాబాద్ దేశంలోని టాప్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటి. ఇటీవలే కోల్ ఇండియాతో కలిసి క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో అనే కొత్త సెంటర్ కూడా ప్రారంభించింది. శుద్ధమైన ఇంధనంమీద పని చేయడంలో ఇది స్పెషలిస్ట్. NFTDC, హకింపేట్ విషయానికి వస్తే దీని పేరు బయటకు ఎక్కువగా వినిపించదు కానీ… అంతర్గతంగా దేశం నడిపించే పలు కీలక టెక్నాలజీలు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. ఇది అత్యాధునిక మాగ్నెట్ల తయారీ, అల్ట్రా కాంపాక్ట్ డివైస్‌లు, నావిగేషన్, మెడికల్ ఇమేజింగ్ వంటి సూపర్ స్పెషల్ ఫీల్డ్స్‌లో పనిచేస్తోంది. EVలకి అవసరమైన రేర్ ఎర్త్ మాగ్నెట్స్ లాంటి టెక్నాలజీలను ఇది డెవలప్ చేస్తోంది. ఈ కేటాయింపులు హైదరాబాద్‌లో ఉన్న విద్యార్థులకు చాలా ఉపయోగకరం. జాబ్స్‌, ఇండస్ట్రీ, స్టార్టప్ లైన్లను తెరిచే గేట్‌వేగా వీటిని భావించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *