అప్పర్‌ బెర్త్‌ ఎక్కి.. స్నాక్ కొట్టేస్తున్న చిల్లర దొంగ

అప్పర్‌ బెర్త్‌ ఎక్కి.. స్నాక్ కొట్టేస్తున్న చిల్లర దొంగ


దీంతో ఆ యువకుడి తీరుకు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రైల్లోని ఓ రిజర్వేషన్ బోగీ నిండుగా ఉంది. రైలు బోగీలోంచి.. చిరువ్యాపారులు అటూ ఇటూ తిరుగుతూ ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్ధాలు అమ్ముతున్నారు. మొదట ఓవ్యక్తి తన నెత్తిపైన ఓ బస్తాలో జ్యూస్‌ ప్యాకెట్లు పెట్టుకొని అమ్ముకుంటూ కనిపించాడు. అలా వచ్చిన ఆ వ్యాపారితో అప్పర్‌బెర్త్‌లో కూర్చున్న యువకుడు మాటలు కలిపాడు. కాసేపటికి ఆ వ్యాపారి అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో కిందపెట్టిన బస్తాను నెత్తిన పెట్టుకున్నాడు. అంతే.. ఆ యువకుడు అప్పర్ బెర్త్ నుంచి ముందుకు వంగి చిటికెలో బస్తా నుంచి ఒక జ్యూస్ ప్యాకెట్ కొట్టేశాడు. ఈ విషయం తెలియక ఆ వ్యాపారి ముందుకెళ్లిపోయాడు. ఆ తర్వాత సమోసా వ్యాపారి బుట్టలోంచి సమోసా కొట్టేసాడు. ఆ తర్వాత వాటర్‌ బాటిల్‌ వ్యాపారి బాస్కెట్ నుంచి ఒక సీసా కొట్టేశాడు. ఇలా.. ఆ బోగీలోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యాపారి నుంచి ఏదో ఒకటి కొట్టేస్తూనే వచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఛీ.. చిల్లర బుద్ధులు’ అని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఇలాంటి వారిని గట్టిగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిల్డింగ్ లిఫ్ట్‌లో గలీజ్ పని చేసిన డెలివరీ బాయ్‌.కేసు నమోదు

మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే

కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!

శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము

3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *