దాదాపు కిలో మీటర్ దూరం వెళ్లాక.. వారు చెట్టుకొమ్మ సాయంతో ఒడ్డు చేరారు. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ లోని తమ పత్తి చేలో పని చేసేందుకు కన్నెపల్లి మండలం జంగంపల్లి కి చెందిన బోరుకుంట రాజం.. తన భార్య, మరో ఇద్దరు కూలీలతో కలిసి ట్రాక్టర్ పై బయలు తేరాడు. కానీ, దారిలోనే భారీ వర్షం రావటంతో వారంతా ఇంటిబాట పట్టారు. వారు ఎర్రవాగు వద్దకు వచ్చేసరికి వాగు జోరుగా పారుతోంది. వెనక్కి వెళితే.. రెండు రోజుల వరకు ఇల్లు చేరలేమని భావించిన రాజం.. తప్పని పరిస్థితిలో వర్షంలోనే వాగు దాటే ప్రయత్నం చేశారు. కానీ, వరద ఉదృతి పెరగటంతో ట్రాక్టర్ తో సహా నలుగురూ వాగులో కొట్టుకుపోయారు. కానీ, కొంతదూరం పోయాక పొదలు, చెట్లు రావటంతో వాటి కొమ్మలు పట్టుకుని వారంతా నెమ్మదిగా ఒడ్డు చేరారు. అయితే ట్రాక్టర్ మాత్రం ఎర్రవాగులో కొట్టుకుపోయింది. భీమిలి మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు దశాబ్దాలుగా కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వరద ఉధృతితో వాగు దాటడం గ్రామీణ ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో వాగు దాటుతున్న క్రమంలో అనేక ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయని.. మరో ప్రమాదం జరగకముందే అదికారులు స్పందించాలని కోరుతున్నారు తిమ్మాపూర్ గ్రామస్తులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పర్ బెర్త్ ఎక్కి.. స్నాక్ కొట్టేస్తున్న చిల్లర దొంగ
బిల్డింగ్ లిఫ్ట్‌లో గలీజ్ పని చేసిన డెలివరీ బాయ్.కేసు నమోదు
మనిషి దంతాల వింత చేప.. పట్టుకుంటే అంతే
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము