మిల్లెట్స్‌లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మిల్లెట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి తిన్నా కూడా రక్తంలో షుగర్ నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. దీంతో డయాబెటిస్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు. మిల్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదల అడ్డుకుంటాయి. తద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు.
మిల్లెట్స్‌లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెకు, గుండె నుంచి అవయనాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మిల్లెట్స్‌లో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మిల్లెట్స్‌లో సంపూర్ణ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.
మిల్లెట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మిల్లెట్స్ తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాలు శ్వాస ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..