కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!

కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!


తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో అలాంటిదే ఓ అద్భుత ఘటన చోటుచేసుకుంది. మంచినీటి కోసం.. కొలను తవ్వుతుండగా అద్భుతమైన ఒక పంచముఖి శివలింగం బయట పడింది. ఈ వార్త విని ఎక్కడెక్కడి నుంచో జనం.. తండోపతండాలుగా అక్కడికి వచ్చి ఆ ప్రాచీన లింగాన్ని దర్శించుకుంటున్నారు. శ్రావణ మాసం మరో రెండు రోజుల్లో రానుంది అనగా..జరిగిన ఈ ఘటన నెట్టింట వైరల్ అయింది. యూపీలోని బుదౌన్ జిల్లా దాతాగంజ్ త‌హ‌సీలీ ప‌రిధిలోని స‌రాయ్ పిప‌రియా గ్రామంలో మంగ‌ళ‌వారం కొల‌ను త‌వ్వుతుండ‌గా ఓ అద్భుతమైన పంచ‌ముఖి శివ‌లింగం బ‌య‌ట‌ప‌డింది. ఇది దాదాపు 300 ఏళ్ల కిందటిది కావొచ్చని స్థానిక బ్రహ్మదేవ్ ఆల‌య పూజారి మ‌హంత్ ప‌ర‌మాత్మా దాస్ మ‌హరాజ్ తెలిపారు. ఇక‌, ఈ విష‌యం చుట్టుప‌క్కల గ్రామాల వారికి తెలియ‌డంతో పంచ‌ముఖి శివ‌లింగాన్ని చూసేందుకు పోటెత్తారు. త‌న 13 ఎక‌రాల స్థలంలో తామర కొల‌ను ఏర్పాటు చేసేందుకు త‌వ్వకపు పనిచేపట్టగా ఈ లింగం బయటపడనట్లు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త షిప్రా పాఠ‌క్ తెలిపారు. నదులు, జల సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టిన ఈమె ఈ స్థలంలోనే పంచ‌త‌త్వ పౌధ్‌శాల పేరిట ఒక పెద్ద న‌ర్సరీని కూడా పెంచుతున్నారు. త‌న ఫౌండేష‌న్ ద్వారా యేటా 5 లక్షల మొక్కల పంపిణీ ల‌క్ష్యంగా పెట్టుకొన్న పాఠ‌క్.. శివ‌లింగం ఆవిర్భావాన్ని భ‌గ‌వ‌ద‌నుగ్రహంగా పేర్కొన్నారు. కాగా, శివ‌లింగం ప‌రిశీల‌న‌కు పురావ‌స్తుశాఖ అధికారుల‌కు సమాచారమిస్తామని దాతాగంజ్ స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్ ధ‌ర్మేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము

3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?

Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!

తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే

Kohinoor: కోహినూర్‌ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *