1990ల ప్రారంభంలో అధికారిక రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికమని, ఈ విషయంలో సౌదీ తీరు మార్చుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం డ్రగ్స్ రవాణా మీద ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశంలో 2022లో 19 మంది డ్రగ్స్ అక్రమ రవాణా దారులకు ఉరి శిక్ష పడగా, 2024 నాటికి ఆ సంఖ్య 117కి పెరిగింది. ఈ ఏడాది అదే తరహా నేరాలకు 144 మందికి మరణశిక్ష విధించింది. ఉరి తీస్తున్న వారిలో ఎక్కువ శాతం విదేశీయులే ఉంటున్నారు. ఒక్క జూన్ నెలలోనే డ్రగ్స్ కేసులో ఆ దేశం 37 మందిని ఉరితీసింది. వీరిలో ఈజిప్ట్,ఇథియోపియా, జోర్డాన్, నైజీరియా, పాకిస్తాన్, సోమాలియా, సిరియా దేశస్థులే 34 మంది ఉన్నారని ఆమ్నెస్టీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నమోదైన 217 మరణశిక్షలలో 96మంది సౌదీ పౌరులేనని కూడా ఆ రిపోర్ట్ పేర్కొంది. డ్రగ్స్ కట్టడి మంచిదేనని, కానీ, అత్యంత అరుదైన నేరాలకు విధించే ఉరిశిక్షను చిన్న చిన్న నేరాలకూ విధించటం తగదని సౌదీ అరేబియా తీరుపై మానవహక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే
Kohinoor: కోహినూర్ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??
నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి
Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??
ఒక్క డైలాగ్ దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం