IND vs ENG : భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మక ఆండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాట్స్మెన్ల ధాటితో పాటు, బౌలర్లు కూడా తమ సత్తా చాటారు. ముఖ్యంగా భారత బౌలర్లు అద్భుతంగా రాణించి, ఇంగ్లండ్‌ను గట్టిగా ఎదుర్కొన్నారు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం.
భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఐదు టెస్టుల సిరీస్‌లో విజయం కోసం ఇరుజట్లు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ సిరీస్ డ్రాగా ముగియడంలో బౌలర్ల పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహ్మద్ సిరాజ్ (భారత్)
భారత పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో తిరుగులేని ప్రదర్శన ఇచ్చాడు. ఐదు టెస్టుల్లో మొత్తం 23 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతూ, రెండు సార్లు ఐదు వికెట్ల హాల్స్, ఒక నాలుగు వికెట్ల హాల్ సాధించాడు. ఇతని సగటు 32.43గా ఉంది. ప్రతి కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీసి జట్టుకు అండగా నిలిచాడు. చివరి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
2. జోష్ టంగ్ (ఇంగ్లండ్)
ఇంగ్లండ్ తరపున యువ బౌలర్ జోష్ టంగ్ అద్భుతంగా రాణించాడు. కేవలం మూడు టెస్టులు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. ఇతని సగటు 29.05గా ఉంది. ఒక నాలుగు వికెట్ల హాల్, ఒక ఐదు వికెట్ల హాల్ సాధించి ఇంగ్లండ్‌కు భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచాడు. భారత్ బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కొంటూ టంగ్ వేసిన బంతులు చాలా ప్రభావం చూపాయి.
3. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. కెప్టెన్‌గా జట్టును నడిపిస్తూ 17 వికెట్లు పడగొట్టాడు. ఇతని బౌలింగ్ సగటు 25.24. ఒక ఐదు వికెట్ల హాల్, ఒక నాలుగు వికెట్ల హాల్ సాధించి, కీలకమైన వికెట్లు తీసి భారత్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. తన బౌలింగ్‌తో జట్టుకు అవసరమైన సమయంలో బ్రేక్ త్రూలు ఇచ్చాడు.
4. జస్ప్రీత్ బుమ్రా (భారత్)
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టుల్లోనే 14 వికెట్లు తీశాడు. ఇతని సగటు చాలా అద్భుతంగా 26గా ఉంది. రెండు సార్లు ఐదు వికెట్ల హాల్స్ సాధించి, తక్కువ మ్యాచ్‌లలోనే తన సత్తా ఏంటో చూపించాడు. బుమ్రా వేసిన బంతులతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఇతని బౌలింగ్ భారత బౌలింగ్ దాడికి పదును పెట్టింది.
5. ప్రసిద్ధ్ కృష్ణ (భారత్)
భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ సిరీస్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. మూడు టెస్టుల్లో 14 వికెట్లు తీశాడు. అతని సగటు 37. ముఖ్యంగా ఓవల్ టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండు నాలుగు వికెట్ల హాల్స్ సాధించి భారత పేస్ బౌలింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేశాడు.
ఈ సిరీస్‌లో ఈ ఐదుగురు బౌలర్లు తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..