Kohinoor: కోహినూర్‌ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??

Kohinoor: కోహినూర్‌ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??


ఇది భారత్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన కోహినూర్‌ వజ్రానికి సంబంధించిన కథ అని తెలిపారు.కోహినూర్‌ వజ్రం ఎక్కడ దొరికింది? అది బ్రిటిష్‌ వాళ్ళదగ్గరకు ఎలా చేరిందనే అంశాలను ఈ మూవీలో తెరకెక్కించారు. కోహినూర్‌ వజ్రం.. నేటి ఏపీలోని పల్నాడు జిల్లాలో దొరికింది. బెల్లంకొండ మండలం కొల్లూరు గనిలో ఓ వితంతువుకు ఆ వజ్రం దొరికిందని, దానిని అమె గ్రామ పెద్ద ద్వారా కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి బహుమతిగా ఇచ్చారనే చారిత్రక కథనం ప్రచారంలో ఉంది. కాకతీయుల ఆరాధ్య దైవమైన కాకతీ దేవి విగ్రహానికి ఆ వజ్రాన్ని అలంకరించి ఆరాధించినట్టు చరిత్ర చెబుతోంది. పలువురి చరిత్రకారుల ప్రకారం.. 14వ శతాబ్దం ప్రారంభంలో ఖిల్జీ రాజవంశం సైన్యం దోపిడీ కోసం దక్షిణ భారతంపై దండయాత్ర చేసింది. ఈ క్రమంలోనే 1310లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ తన సేనాని మాలిక్‌ కాఫుర్.. కాకతీయుల రాజధాని అయిన వరంగల్‌ నగరం మీద దాడి చేసి.. నాటి పాలకుడైన ప్రతాపరుద్రుడిని ఓడించాడు. ప్రతాపరుద్రుడి పాలనలో కోహినూరు వజ్రం గోల్కొండ కోటలో ఉండేదని, క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ పంపిన మాలిక్‌ కాపుర్‌తో ప్రతాప రుద్రుడు సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూర్‌ వజ్రాన్ని వారికి సమర్పించారు. అయితే ఆ తర్వాత కోహినూరు వజ్రం .. పలువురు పాలకుల చేతులు మారుతూ.. ఇబ్రహీం లోడి చేతికి చిక్కింది. కాగా, మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్‌ రాజవంశ స్థాపకుడైన బాబర్‌ చేతిలో ఇబ్రహీంలోడి ఓటమి పాలై మరణించిన తర్వాత అది బాబర్ వశమైంది. ఆ వజ్రాన్ని అతడు.. సింహాసనం పైభాగంలోని రత్నపు నెమలి తలపై పొదిగించాడు. 739లో పర్షియన్‌ పాలకుడు నాదిర్‌షా మొఘల్‌ సామ్రాజ్యంపై దండెత్తి ..వారిని ఓడించాడు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్‌ చక్రవర్తులు శతాబ్దాలుగా పోగు చేసిన అపారమైన సంపదను తన వశం చేసుకున్న నాదిర్‌షా ఆ వజ్రాన్ని కూడా తీసుకువెళ్లాడు. నాదిర్‌షా వజ్రాన్ని చూడగానే .. కోహ్‌–ఇ–నూర్‌ అంటే కాంతిని విరజిమ్మే పర్వతం అనే అర్థంలో దానికి పేరుపెట్టాడు. నాటి నుంచి ఆ వజ్రానికి కోహినూరు అనే పేరు వచ్చింది. 1747-1856 కాలంలో నాదిర్‌షా నుంచి ఆ వజ్రం అహ్మద్‌ ఖాన్‌ అబ్దాలీ ద్వారా అఫ్గానిస్తాన్‌లోని దుర్రానీ రాజు చేతికి చేరుకుంది. వజ్రం దాదాపు ఏడు దశాబ్దాల పాటు అక్కడే ఉంది. 1813లో అబ్దాలీ తర్వాత.. ఆ వజ్రం సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌సింగ్‌ వద్దకు చేరింది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కుల ఓటమి తర్వాత రంజిత్‌సింగ్‌ వారసుడు దులీప్‌ సింగ్‌ యుద్ధ ఒప్పందంలో భాగంగా కోహినూరును బ్రిటిష్‌ వారికి అప్పగించారు. 1851లో కోహినూరు లండన్‌లోని గ్రేట్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దానిని పాలిష్ చేసి.. క్వీన్‌ విక్టోరియా గౌన్‌కు కుడివైపున బ్రోచ్‌గా మలిచారు. ఆ తర్వాతి కాలంలో అది అక్కడి పాలకుల కిరీటంలో చేరింది. ప్రపంచంలోని అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్‌ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందనా లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా కూతరు మెంటల్‌ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి

Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??

ఒక్క డైలాగ్‌ దెబ్బకు రిలీజ్‌ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం

రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్‌? నీకెలా నేషనల్ అవార్డ్‌ వచ్చింది?

Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *