బ్రోకలీలో ఫైబర్ ఎక్కవగా ఉండడం వల్ల.. దీన్ని అధికంగా తీసుకుంటే ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. దీనిని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు గ్యాస్టిక్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
బ్రోకలీలో థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగించే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కవ ప్రభావం చూపుతాయి. ఇవి అయోడిన్ గ్రహించడాన్ని అడ్డుకోవడం కారణంగా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
కొందరు గుండె జబ్బులు, ఇతర కారణాలతో రక్తం పల్చబడటానికి మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు వీటిని తినే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వీటిలో అధికంగా ఉండే విటమిన్ కె.. మీరు వాడే మందుల ప్రభావాన్ని తగ్గించి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచవచ్చు. కాబట్టి ఇలాంటి మందులు వాడే వారు దాన్ని తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
బ్రోకలీ తినడం వల్ల చాలా అరుదుగా, కొంతమందికి అలెర్జీ సమస్యను ఎదుర్కొంటారు. వారు దీన్ని తిన్న తర్వాత శరీరంపై దద్దుర్లు, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
అమితంగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుందన్నట్లు.. ఈ బ్రోకలీ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే అన్నే ఆనారోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు బ్రోకలీని తినే ముందు వైద్యుల సలహాలు తీసుకోండి.