అసలు ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలియక అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు. ఆమె ప్రవర్తన చూస్తే మానసిక పరిస్థితి బాగోలేదని కామెంట్స్ చేశారు చాలా మంది. ఇక ఇప్పుడు తండ్రి కూడా ఇదే విషయం బయటపెట్టాడు. ఆమె పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. సోషల్ మీడియాలో ఈమె గురించి మరో సారి చర్చ లేవనెత్తాడు. కల్పిక తండ్రి సంఘవార్ గణేష్ తన కూతురిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు మెంటల్ డిజార్డర్ ఉందని.. ఆమె వల్ల కుటుంబసభ్యులకు, ప్రజలకు ప్రమాదముందని ఫిర్యాదులో పేర్కొని సంచలనంగా మారాడు. అంతేకాదు ఇప్పటికే కల్పిక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తే అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసిందని తెలిపాడు సంఘవార్ గణేష్. కల్పిక రెండేళ్లుగా మెడిసిన్ ఆపేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. అందుకే ఇంట్లో తరచూ గొడవలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కూతురు చేసే పనులతో కుటుంబానికి సంబంధం లేదని వెల్లడించారు. తన కూతురిని తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కల్పిక గురించి స్వయంగా తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??
ఒక్క డైలాగ్ దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం
రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్? నీకెలా నేషనల్ అవార్డ్ వచ్చింది?
Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??