Mohammed Siraj : భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. 2025లో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు పడగొట్టి, అక్కడ ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాతో కలిసి రికార్డు నెలకొల్పాడు. ముఖ్యంగా ఓవల్ టెస్టులో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఏకంగా 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బుమ్రా రికార్డును సమం చేసిన సిరాజ్
ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మహ్మద్ సిరాజ్ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రాతో సమానంగా ఉన్నాడు. బుమ్రా 2021-2022 ఇంగ్లాండ్ పర్యటనలో 23 వికెట్లు తీసి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు సిరాజ్ కూడా అదే సంఖ్యలో వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అతను 2014 సిరీస్‌లో 19 వికెట్లు తీశాడు.
ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు
జస్ప్రీత్ బుమ్రా – 23 వికెట్లు
మహ్మద్ సిరాజ్ – 23 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ – 19 వికెట్లు
సిరీస్‌లో సిరాజ్ అత్యధిక వికెట్ల వీరుడు
2025లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సిరీస్ అంతా నిలకడగా రాణించిన సిరాజ్ మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 19 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 17 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు, గాయాల కారణంగా కేవలం 3 మ్యాచ్‌లలో ఆడిన జస్ప్రీత్ బుమ్రా కూడా 14 వికెట్లు తీసి తన ప్రభావాన్ని చూపాడు. ఓవల్ టెస్టులో 8 వికెట్లు తీసిన యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు సాధించి మంచి ప్రదర్శన ఇచ్చాడు.
2025 భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
మహ్మద్ సిరాజ్ – 23 వికెట్లు
జోష్ టంగ్ – 19 వికెట్లు
బెన్ స్టోక్స్ – 17 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా – 14 వికెట్లు
ప్రసిద్ధ్ కృష్ణ – 14 వికెట్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..