ఒక్క డైలాగ్‌ దెబ్బకు రిలీజ్‌ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం

ఒక్క డైలాగ్‌ దెబ్బకు రిలీజ్‌ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం


ఈ పుస్తకం 2017 ఆగస్ట్‌లో విడుదలైంది. ఈ సినిమా టీజ‌ర్ చూస్తుంటే.. ఉత్తరాఖండ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జ‌న్మించి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యోగి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎలా ఎదిగారనేది చూపించబోతున్నారు మేకర్స్. సామ్రాట్‌ సినిమాటిక్స్‌ బ్యానర్‌పై నిర్మాత రితూ మేంగి, రవీంద్ర గౌతమ్‌ దర్శకత్వంలో రూపొందించారు. అనంత్‌ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. సినిమా ట్రైలర్‌ చూస్తే సినిమాలో అజేయ్‌ అనే క్యారెక్టర్‌ పూర్తి మాస్‌ హీరో రేంజ్‌లో కనిపిస్తోంది. పంచ్‌ డైలాగ్స్‌, ఫైరీ స్పీచ్‌లతో నిండిపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో రౌడీలు ప్రజల కాళ్లదగ్గరకు వచ్చి పడేలా చేస్తానంటూ హీరో చెప్పిన డైలాగ్‌ అద్భుతంగా పేలింది. అయితే అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఈ సినిమాకు సంబంధించి సర్టిఫికేషన్‌ కోసం.. జూన్‌ మొదటి వారంలోనే సెన్సార్‌ బోర్డును ఆశ్రయించారు ఫిల్మ్‌ మేకర్స్‌. సినిమా టీజర్‌, ట్రైలర్‌, పాటలను బోర్డుకు పంపించారు. కాని.. సెన్సార్‌ ప్యానల్‌ స్పందించలేదు. చాలారోజులు సర్టిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో.. దీన్ని థియేటర్లలో ప్రదర్శించలేకపోయారు. మరోవైపు మేకర్లు ట్రైలర్‌ను జులై మొదటి వారంలో ఆన్‌లైన్లో రిలీజ్‌ చేసేశారు. దీనికి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. టీజర్‌లోనే ఆగస్ట్‌ 1 విడుదల అంటూ ప్రకటించారు కూడా. ఆ తర్వాత కూడా సెన్సార్‌ బోర్డు స్పందించకపోవడంతో.. లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యారు మేకర్లు. సెన్సార్‌ బోర్డుపై ఫిర్యాదు చేస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేసింది సామ్రాట్‌ సినిమాటిక్స్‌. CBFC తమ సినిమాకు, టీజర్‌, ట్రైలర్స్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. జులై 15న బాంబే హైకోర్టు CBFCకి నోటీసులు పంపించింది. ఎందుకు డిలే చేస్తున్నారో చెప్పాలంటూ వివరణ కోరింది. జూన్‌ మొదటి వారంలోనే సర్టిఫికేట్‌ కోసం వెళ్లినా.. కావాలనే పక్కనబెట్టారని అజేయ్‌ ఫిలిం మేకర్లు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాలో ఎలాంటి వక్రీకరణలు లేవని వివరణ ఇచ్చుకున్నారు. 8 ఏళ్ల క్రితం విడుదలై ప్రజాదరణ చూరగొన్న బుక్‌ ఆధారంగానే సినిమాను రూపొందించామని.. ఇందులో ఎవర్నీ కించపర్చిన సీన్లు కూడా లేవంటూ మేకర్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాంబే హైకోర్టు కూడా ఈ విషయంపైనే సెన్సార్‌ బోర్డును ప్రశ్నించింది. ఆల్రెడీ ప్రజల్లో ఉన్న బుక్‌పై ఎలాంటి వివాదాలు లేనప్పుడు సర్టిఫికేట్‌ ఇవ్వడానికి ఇబ్బందేంటని నిలదీసింది. మరోవైపు సెన్సార్‌ సభ్యులు ఈ సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అజేయ్‌ మూవీపై అభ్యంతరాలు ఏమీ లేవంటూ CM యోగి ఆదిత్యనాథ్‌ ఆఫీస్‌ నుంచి NOC తెచ్చుకోవాలని మేకర్స్‌ను కోరారు. కాని మేకర్స్‌ మాత్రం ఈ అభ్యర్థనను తిరస్కరించారు. అలాంటి NOCలు తెచ్చుకోవాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నిస్తున్నారు. ఫిలిం మేకర్స్‌ ప్రయార్టీ చార్జెస్‌ చెల్లించిన తర్వాత కూడా అప్లికేషన్‌ను సీటుకింద పెట్టుకుని కూర్చోడం ఏంటని ప్రశ్నించింది బాంబే హైకోర్టు. రెండు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చింది CBFC. ఫైనల్‌గా జులై 31న అజేయ్‌ సినిమాకు సర్టిఫికేట్‌ ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది సెన్సార్‌ బోర్డు. ఇక ఆగస్ట్‌ 1న జరిగిన వాదనల్లో.. హైకోర్టు సెన్సార్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడంలేదో చెప్పాలంటూ మరోసారి నోటీసులు జారీచేసింది. ఇప్పటికే మేకర్లు ప్రకటించిన ఆగస్ట్‌ 1 విడుదల దాటిపోయింది. సెన్సార్‌ సర్టిఫికేట్‌ కూడా రాలేదు. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్‌? నీకెలా నేషనల్ అవార్డ్‌ వచ్చింది?

Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *