భారతదేశంలో రోజురోజుకూ లివ్-ఇన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుత జనరేషన్లో ఇదొక ట్రెండ్‌గా మారింది. ఈ సంబంధాన్ని సమాజం ఒప్పుకోకపోయినా.. చట్టం వాటిని నేరంగా మాత్రం పరిగణించట్లేదు. ఇండియాలో లివ్ఇన్ రిలేషన్స్ చట్టబద్దంగా గుర్తించబడినప్పికీ వాటికి కోర్టులు కొన్ని షరతులను విధించాయి. మేజర్స్ మాత్రమే ఇలా కలిసి ఉండడానికి అర్హులు.. అయితే, లివ్-ఇన్ రిలేషన్లో జంటల మధ్య భిన్నాభిప్రాయాలు కారణంగా కొన్ని సార్లు విభేదాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో మహిళలపై దుర్వినియోగం లేదా హింస జరగవచ్చు. అప్పుడు వారు విడిపోవాలనుకుంటారు. అయితే ఇలా విడిపోయేప్పుడు వారి భాగస్వామి ఆస్తిలో మహిళలకు హక్కు ఉంటుందా లేదా అని చాలా మందిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇప్పుడు వాటి గురించి తెలసుకుందాం పదండి.
కొన్ని అధ్యయనాలు నివేదికల ప్రకారం, భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో లైవ్-ఇన్ రిలేషన్లో ఉండే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతి 10 జంటలలో 1 జంట లైవ్-ఇన్ రిలేషన్లో ఉంటున్నారు. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు తర్వాత మొదటిసారిగా లైవ్-ఇన్ సంబంధాలలో ఉన్న జంటలకు చట్టపరమైన గుర్తింపు లభించింది. ఈ కోడ్ ప్రకారం ఎక్కవుకాలం లివింగ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న స్త్రీ కూడా ఇల్లాలుగా పరిగణించబడుతుంది. గౄహ హింస, జీవనాధారం వంటి చట్టాల నుంచి ఆమె రక్షణ కూడా పొందుతుంది. ఎక్కువ కాలం లివ్ఇన్ రిలేషన్లో ఉన్న మహిళను ఆమె భాగస్వామి వదిలేసి వెళ్లాలని నిర్ణయించుకుంటే.. అతడి నుంచి ఆమె భరణం కూడా పొందవచ్చుని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
ఒక వ్యక్తితో లివిన్లో ఉన్న మహిళకు తన భాగస్వామి ఇంట్లో నివసించే హక్కు ఉంటుందిని UCC తెలిపింది. ఒక వేళ ఆమెను ఇంట్లో ఉండగానికి తన భాగస్వామి నిరాకరిస్తే, ఆమె చట్టబద్ధంగా తన హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఇద్దరు లివింగ్‌లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిస్తే.. ఆ పిల్లలను కూడా చట్టబద్దంగా పరిగణించబడుతారు. పిల్లలు తమ తండ్రితో సమానమైన హక్కులను పొందువచ్చు. అంతేకాకుండా తండ్రి సంపాదించిన ఆస్తిపై ఆ పిల్లలకు పూర్తి హక్కులు ఉంటాయి.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీన్ని మేము ఖచ్చితంగా దృవీకరించలేదు.. ఈ అంశంపై మీకు ఎవైనా సందేహాలు ఉంటే.. జడ్జి, లాయర్స్, లేదా నిపుణుల సలహాలు తీసుకోండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.