వృషభం: శుక్రుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల సాధారణంగా ఈ రాశిలో పుట్టిన మహిళలు బాగా అదృష్టవంతులవుతారు. వీరి కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి, సంతాన పురోగతి వంటివి సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. వీరి కుటుంబంలో అనేక విధాలైన పురోగతి కనిపిస్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వీరు షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా ధన లాభాలు కలుగుతాయి. భర్తకు పదోన్నతులు లభిస్తాయి.
మిథునం: ఈ రాశికి శుక్రుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారుతున్నందువల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగం కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వీరికి లాభాల పంట పండిస్తాయి. వీరి పేరు మీద వ్యాపారాలు ప్రారంభించినా, పెట్టుబడులు పెట్టినా అత్యధిక లాభాలు కలుగుతాయి. ఈ రాశి మహిళలకు తప్పకుండా లక్ష్మీయోగం కలుగుతుంది.
కర్కాటకం: కుటుంబ జీవితం కోసం అత్యధికంగా పాటుపడే ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల మహిళల అభ్యున్నతికి అనేక విధాలుగా అవకాశాలు అందుతాయి. దాంపత్య జీవితం మరింత అన్యోన్యంగా సాగి పోతుంది. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆరితేరు తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి చేతుల మీదుగా లేదా వీరి పేరు మీద పెట్టే పెట్టుబడులు లాభాల పంట పండిస్తాయి.
కన్య: ఈ రాశికి చెందిన మహిళలకు దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ భద్రత కోసం మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ అవకాశాన్నీ వదులు కోరు. మదుపులు, పెట్టుబడులకు, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల్లో వీరు నిష్ణాతులు. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా రాణిస్తారు. నైపుణ్యాలను పెంచుకుంటారు. సొంత ఇల్లు, సొంత వాహనం, సొంత ఆస్తికి వీరు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, వాటిని సంపాదించుకుంటారు.
తుల: ఈ రాశివారు కుటుంబ జీవితానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపార ధోరణి ఎక్కువగా కలిగి ఉండే ఈ రాశి మహిళలు తమ కుటుంబానికి ఉపయోగం లేని పనిని చేయరు. వృత్తి, ఉద్యోగాల ద్వారానే కాకుండా, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తిపాస్తులు, ఇంటి అద్దెలు వగైరాల ద్వారా వీరు ఆదాయాన్ని బాగా పెంచి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం రాశ్యధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి.
మీనం: ఈ రాశివారికి కుటుంబ జీవితం మీద మమకారం కాస్తంత ఎక్కువ. కుటుంబం అభివృద్ధికి వీరు చేయని ప్రయత్నం ఉండకపోవచ్చు. ప్రస్తుతం శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు కుటుంబం బాగోగులకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరుగుతుంది. వీరి ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.