Isabgol Benefits: మలబద్దకం సహా జీర్ణ సమస్యలకు సైలియం పొట్టు చక్కటి పరిష్కారం .. ఎలా తీసుకోవాలంటే..

Isabgol Benefits: మలబద్దకం సహా జీర్ణ సమస్యలకు సైలియం పొట్టు చక్కటి పరిష్కారం .. ఎలా తీసుకోవాలంటే..


ఇసాబ్గోల్ పొట్టు దీనినే సైలియం పొట్టు అని కూడా అంటారు. ఇది దాదాపు అందరికీ సుపరిచితమే. సైలియం పొట్టు గోధుమ మొక్కలలా కనిపిస్తుంది. శాస్త్రీయ భాషలో ఈ మొక్కను సైలియం పొట్టు అంటారు. తెల్లటి విత్తనాలు ఈ మొక్క కొమ్మలకు అంటుకుంటాయి. వీటిని సైలియం పొట్టు అంటారు. ఒక రకమైన విత్తనం ఈ పొట్టు. ఇది కడుపు వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుందని చెబుతారు. సైలియం పొట్టు.. కడుపులోని నీటి భాగాన్ని త్వరగా గ్రహిస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.

ఇది చాలా సంవత్సరాలుగా మలబద్ధకం, విరేచనాలు, కడుపు సంబంధిత వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతోంది. ఇసాబ్గోల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపుని ఎక్కువసేపు నింపుతుంది. ఇందులో వివిధ పోషకాలున్నాయి. 1 టేబుల్ స్పూన్ ఇసాబ్గోల్‌లో 53 శాతం కేలరీలు, 15 మిల్లీగ్రాముల సోడియం, 15 గ్రాముల చక్కెర, 30 మిల్లీగ్రాముల కాల్షియం, 0.9 మిల్లీగ్రాముల ఐరన్ ఉన్నాయి. ఇసాబ్గోల్‌లో ఎటువంటి కొవ్వు ఉండదు.

ఇసాబ్గోల్ పొట్టులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా తినవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మూత్ర సమస్యలకు ప్రయోజనకరమైన ఆహారం. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మూత్ర విసర్జనలో మంట తగ్గుతుంది. ఇసాబ్‌గుల్ పొట్టును చెరకు బెల్లంతో కలిపి తినడం వలన మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇసాబ్‌గుల్ పొట్టు గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు మంచి వంటించి చిట్కా. ఇది ఆమ్లం ద్వారా కడుపు గోడ కోతకు గురికాకుండా చేస్తుంది. విరేచనాలను నివారించడంలో ఇసాబ్‌గుల్ మంచి పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఇసాబ్గోల్ పొట్టుని ఎలా తినాలంటే

  1. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ ఈ విత్తనాలను కలపండి. రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు ఇసాబ్గుల్ కలిపిన నీటిని త్రాగండి. కొన్ని నిమిషాల తర్వాత కనీసం 1 గ్లాసు నీరు త్రాగండి. ఇలా 1 గ్లాసు నీటితో కలుపుకుని రోజుకు 10-20 గ్రాముల ఇసాబ్గుల్ త్రాగవచ్చు.
  2. బరువు తగ్గడానికి త్రిఫల చూర్ణం ఇసాబ్‌గోల్ విత్తనాలు కలిపి పానీయం తయారు చేసుకుని త్రాగవచ్చు. దీని కోసం ఇసాబ్‌గోల్ పొట్టు, ఒక చెంచా త్రిఫల పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. సుమారు 2 నిమిషాలు బాగా కలిపి త్రాగండి. ఇది పేగులను శుభ్రపరచడంలో, బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
  3. పెరుగుతో ఇసాబ్గోల్ కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి కడుపు ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడతాయి. ఒక గిన్నె పెరుగు తీసుకొని దానిలో ఒక చెంచా ఇసాబ్గోల్ పొట్టు కలపండి. కొంచెం సేపు అలాగే ఉంచి తినండి. ఇది కడుపులోని బ్యాక్టీరియాను బలపరుస్తుంది.ఇది జీర్ణక్రియను పెంచుతుంది. శరీరంలో అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
  4. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఇసాబ్గోల్ తినవచ్చు. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ ఇసాబ్‌గోల్ విత్తనాలను కలపండి. సుమారు 2 నిమిషాలు అలాగే ఉంచి ఆ నీటిని త్రాగండి. ఇది కడుపులోని జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. నడుము చుట్టూ పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *