ఈ మధ్య కాలంలో ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మరికొన్ని రోజుల్లోనే ఏటీఎంలలో రూ.500 నోట్లు పూర్తిగా బంద్ అవుతాయని, కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయనే మెసేజులు వాట్సాప్‌లో బాగా సర్క్యూలేట్ అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఏటీఎంలలో రూ.500 నోట్లు మొత్తానికే రావాని ఆ మెసేజుల సారాంశం. అలాగే 2026 మార్చ్ నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంతో చాలా మంది ప్రజలు రూ.500 నోట్లు రద్దు అవుతాయని భయపడుతున్నారు. కొంతమంది అయితే ఇప్పటికే తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు పరుగులు తీశారు. వీలైనంత త్వరగా తమ వద్ద ఉన్న రూ.500 నోట్లను మార్చుకోవడమో లేదా తమ అకౌంట్లలో జమ చేసుకోవడమో చేయాలని సామాన్య ప్రజలు ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
ఆర్బీఐ నుంచి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది తప్పుడు సమాచారం అంటూ స్పష్టతను ఇచ్చింది. ఏటీఎంల నుంచి రూ.500 నోట్లు ఆపేయాలన్నది వదంతి మాత్రమే. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకండి. రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతూనే ఉంటాయి అంటూ క్లారిటీ ఇచ్చింది. సో.. రూ.500 నోట్ల విషయంలో ఎలాంటి కంగారు అక్కర్లేదు. గతంలో కూడా ఇలాంటి వదంతులు చాలానే వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి