
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రెండు షీల్డ్ కవలర్లలో 650 పేజీల నివేదికను కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో కమిషన్ కీలక విషయాలను ప్రస్థావించింది. ప్రాజెక్ట్ వైఫల్యాని ప్రత్యక్షంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, పరోక్షంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావును బాధ్యులుగా పేర్కొంది. అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్, నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కమిషన్ స్పష్టం చేసింది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్ ముందుకు తీసుకువచ్చారు. ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్‌ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును బాధ్యుడిగా ఘోష్ నివేదిక ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని సూచిస్తూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని.. కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆ నివేదికను తొక్కి పెట్టారని ఘోష్ రిపోర్ట్ తేల్చి చెప్పినట్టు మంత్రి ఉత్తమ్ వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.