Budhaditya Yoga 2025: ఏర్పడిన బుధాదిత్య యోగం.. ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..

Budhaditya Yoga 2025: ఏర్పడిన బుధాదిత్య యోగం.. ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..


జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. కొన్నిసార్లు గ్రహాలు ఒక రాశిలోని ఒక ఇంటి నుంచి మరొక ఇంటిలోకి మారడం కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మొత్తం 12 రాశుల జీవితాలపై శుభ, అశుభ ప్రభావాలను చూపించనున్నాయి. ఆగస్టు నెలలో అనేక గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఈ రోజు బుదాదిత్యయోగం ఏర్పడింది. దీని ఫలితంగా ఐదు రాశులకి చెందిన వ్యక్తుల జీవితాలపై సానుకూల ప్రభావం ఉంటుంది.

ఈరోజు ఆగస్టు 4వ తేదీ సోమవారం అంటే ఈ రోజు సూర్యుడు, బుధుడు కర్కాటక రాశిలో కలిశారు. ఈ రెండు గ్రహాల కలయిక బుధాదిత్య రాజ్యయోగాన్ని ఏర్పరిచింది. జ్యోతిషశాస్త్రంలో వివరించిన అన్ని రాజయోగాలలో బుధాదిత్య రాజ్యయోగం అత్యంత ముఖ్యమైనది. ఇది చాలా శక్తివంతమైనది. శుభప్రదమైనది. ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10వ తేదీల మధ్య, బుధాదిత్య రాజ్యయోగ ప్రభావం కారణంగా ఐదు రాశులు ప్రధాన మార్పులకు లోనవుతాయి. వీరి జీవితాలు డబ్బు, కీర్తి, గౌరవంతో నిండి ఉంటాయి. మీరు కూడా జాబితాలో ఉన్నారా? తెలుసుకోండి

వృషభ రాశి: ఈ రోజు నుంచి వృషభ రాశికి చెందిన వ్యక్తుల జీవితాల్లో మంచి రోజులు తిరిగి వస్తాయి. ఈ రాశి వారి జీవితంలో ప్రేమ, సృజనాత్మకత, పిల్లలకు సంబంధించిన విషయాలు బాగుంటాయి. భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. సృజనాత్మక పనిలో వీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు విదేశాలలో చదువుకునే అవకాశం పొందవచ్చు. బుధాదిత్య యోగ ప్రభావం వల్ల నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. పెట్టుబడులకు ఈ సమయం శుభప్రదం. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: సూర్యుడు, బుధుల కలయికలో బుధాదిత్య యోగం మిథున రాశి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏ పనిలోనైనా సానుకూల దృక్పథం ఉంటుంది. పనిలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి వీరికి సహకారం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. శారీరక ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి.

సింహ రాశి: ఆగస్టు మొదటి వారంలో సింహ రాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వీరు తమ ఆదాయాన్ని, ఖర్చులను సమతుల్యం చేసుకోవడం ద్వారా పొదుపు చేయాల్సి ఉంటుంది. విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంబంధాలలో కూడా సానుకూల మార్పులు ఉంటాయి. వీరు తమ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది.

తుల రాశి: బుధాదిత్య రాజ్యయోగం తులారాశి వారి జీవితంలో మార్పులను తీసుకురాబోతోంది. రానున్న కొద్ది రోజుల్లో వీరి అనేక కోరికలు నెరవేరతాయి. కొత్త ఆదాయ వనరులు లభించడంతో డబ్బు సంపాదించడానికి బహుళ మార్గాలు సుగమం అవుతాయి. వీరికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. సామాజిక సంబంధాలు బలపడతాయి. మనస్సులో ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. వీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. జీతం పెరిగే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: బుధుడు, సూర్యుడి కలయిక ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని చేకూరుస్తుంది. విద్య లేదా పరిశోధనలతో సంబంధం ఉన్న వ్యక్తులు అభివృద్ధి చెందుతారు. బుధాదిత్య యోగం, సిద్ధ యోగ ప్రభావంతో ఆధ్యాత్మిక భావనలపై నమ్మకం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత అప్పులను చెల్లించి ఋణం నుంచి విముక్తి పొందుతారు. లాటరీ టికెట్ కొనడం వల్ల భారీ లాభాలు రావచ్చు. వీరు తమ కెరీర్‌లో ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *