ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ బాగా అలవాటైపోయింది. ఒక పూట తిండి లేకపోయినా ఉంటారు.. కానీ, చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా మాత్రం చాలా మంది ఉండలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మొబైల్ ఫోన్ అనేది ప్రజలకు ఒక వ్యసనంగా మారిపోయింది. వీరిలో పిల్లలు కూడా ఉంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు మారాం చేయకుండా ఉండేదుకు గానూ వారి చేతిలో మొబైల్ పెట్టేస్తున్నారు. అలాగే, మరికొందరు పిల్లలు ఫోన్ చూస్తే గానీ భోజనం చేయరు. ఇలా ఎంతోమంది పిల్లలు మొబైల్‌ఫోన్‌కి బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఒక 16ఏళ్ల బాలుడు అమ్మ ఫోన్ ఇవ్వడం లేదని దారుణానికి పాల్పడ్డాడు.
మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఖావ్డాలో 16 ఏళ్ల బాలుడు తన తల్లి మొబైల్ ఫోన్ కొనివ్వడం లేదని కొండ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.16ఏళ్ల అథర్వ గోపాల్ టేడే తన తల్లిని మొబైల్ ఫోన్ కొని ఇవ్వమని చాలాసార్లు అడిగాడు. తల్లి నిరాకరించడంతో టిస్‌గావ్ వద్ద ఉన్న కొండపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అథర్వను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ వల్ల కలిగే ప్రమాదాలు:
ఇవి కూడా చదవండి
నేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ మనందరి జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం లేవడం నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం ఎక్కువ సమయం స్క్రీన్‌పైనే గడుపుతాము. సోషల్ మీడియా, గేమ్స్, చాటింగ్, వీడియోలు చూసే అలవాటు మనల్ని గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోబెడుతుంది.
రోజంతా ఫోన్ ఉపయోగించిన తర్వాత మెదడు బరువుగా, అలసిపోయినట్లు అనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రజలు ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న విధానం వారి అభ్యాస సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా తగ్గిస్తోంది.
ఇది మాత్రమే కాదు, న్యూరోడీజెనరేషన్ ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 18-25 సంవత్సరాల మధ్య ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల మెదడు బయటి పొర అయిన సెరిబ్రల్ కార్టెక్స్ సన్నబడటానికి కారణమవుతుందని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…