కలెక్టర్ అవ్వాలని కలలుకన్నది.. కట్ చేస్తే హీరోయిన్ అయ్యింది.. అందంలో అప్సరస ఈ భామ

కలెక్టర్ అవ్వాలని కలలుకన్నది.. కట్ చేస్తే హీరోయిన్ అయ్యింది.. అందంలో అప్సరస ఈ భామ


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో రకరకాల పనులు చేసే వారు. కొంతమంది సేల్స్ గర్ల్స్ గ మరికొంతమంది కాల్ సెంటర్స్ లో కూడా పని చేశారు. మరికొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఐఏఎస్ అవ్వాల్సిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్ అవ్వకపోతే కలెక్టర్ అయ్యేది ఈ ముద్దుగుమ్మ.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారింది. సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ అమ్మడి అందానికి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

హీరోయిన్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తున్నారు. అవకాశాలు వస్తున్న అదృష్టం కలిసి రాని భామల్లో రాశి ఖన్నా ఒకరు. ముందుగా ఈ చిన్నది బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ఆతర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే అందం, నటన పరంగాను రాశీ ఖన్నాకు మంచి మార్కులు పడ్డాయి. గతంలో రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని, అయితే మోడలింగ్‌లో పై ఆసక్తి ఉండటంతో స్క్రీన్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఇక రాశీ ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమాలోనూ నటించింది. కానీ ఈ అమ్మడు అంతగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది. ప్రస్తుతం తెలుగులో తెలుసా కదా అనే సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు ఓ క్రేజీ ఆఫర్స్ వచ్చింది. ఏకంగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకతంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది రాశీ. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా శ్రీలీల  నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *