జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కన్నుమూశారు.. అనారోగ్య సమస్యలతో గత కొంత కాలం నుంచి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిబు సోరెన్ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దీంతో పాటు ప్రధాని మోదీ.. సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళి.. శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. శిబు సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కల్పనా దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు.. ఈ మేరకు మోదీ ఎక్స్ లో ఫొటోలను షేర్ చేశారు.
Went to Sir Ganga Ram Hospital to pay homage to Shri Shibu Soren Ji. Also met his family. My thoughts are with Hemant Ji, Kalpana Ji and the admirers of Shri Shibu Soren Ji.@HemantSorenJMM@JMMKalpanaSoren pic.twitter.com/nUG9w56Umc
— Narendra Modi (@narendramodi) August 4, 2025
‘‘శిబు సోరెన్ జీకి నివాళులర్పించడానికి సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్ళాను. నా ఆలోచనలు ఆయన కుటుంబం హేమంత్, కల్పనా, శ్రీ శిబు సోరెన్ జీ అభిమానులతో ఉన్నాయి.’’ అంటూ ట్వీట్ చేశారు.
శిబు సొరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో విజయం సాధించి మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 2005లో కేవలం 10 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. రెండోసారి 2008 నుండి 2009 వరకు…మూడోసారి 2009 నుండి 2010 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబు సొరెన్ ఉన్నారు. అలాగే దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గుశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..