రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. నేను నిన్నే పెళ్లాడతా సినిమా చేసిన తర్వాత అన్నమయ్య చేశా.. అప్పుడు నన్ను చాలా మంది ఎందుకు చేస్తున్నావ్ అన్నారు. కెరీర్ లో కొత్త కొత్తవి చేయడం నాకు ఇష్టం. ఎన్నో దెబ్బలు తిన్నాను. ఒకరోజు లోకేష్ వచ్చిన సార్ విలన్ రోల్ చేస్తారా..అని అడిగాడు. నేను లోకేష్ చేసిన సినిమాల్లో ఖైదీ, విక్రమ్ నా ఫేవరేట్ మూవీస్.. లోకేష్ చాలా కూల్.. నేను నో చెప్పినా కూడా అతను ట్రై చేస్తూనే ఉంటాడు. ఇక లోకేష్ కథ చెప్పినప్పుడు రజినీకాంత్ గారు ఒప్పుకున్నారా అని అడిగాను. ఎందుకంటే ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా హీరో రేంజ్ లో ఉంటుంది. అందుకే నేను రజినీకాంత్ ఒప్పుకున్నారా అని అడిగా..
లోకేష్ సినిమాలో విలన్ పాత్రలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. లోకేష్ కథ చెప్పేటప్పుడు నేను రికార్డ్ చేసుకున్నా.. ఇంటికి వెళ్లి మళ్లీ విన్నాను.. నేను కొన్ని పాయింట్స్ చెప్పా.. అవి లోకేష్ ఎంతో కూల్ గావాటిని తీసుకున్నాడు. నాకు 6,7సార్లు కథ చెప్పాడు. ఫైనల్ గా కథను రెడీ చేశాడు. అద్భుతంగా కథను రాసుకున్నాడు. నేను కూడా విలన్ గా చేయాలనుకున్నా.. రెండో రోజు షూట్ లో మేము ఓ సీన్ చేశాం.. కానీ అది లీక్ అయ్యింది. ఆ సీన్ లీక్ అయినప్పుడు చాలా భాదగా అనిపించింది. కానీ ఆ సీన్ షూట్ తర్వాత లోకేష్ సార్ మీరు ఇరగదీశారు అని చెప్పాడు.
లోకేష్ తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. లోకేష్ తో ఒక్కసారి వర్క్ చేస్తే మళ్లీ మళ్లీ చేయాలని అందరూ అనుకుంటారు. లోకేష్ కు ఇచ్చిన బడ్జెట్ కంటే 5 కోట్లు మిగిలేలా వర్క్ చేశాడు. సత్య రాజ్ గారి సినిమాలు ఎప్పటి నుంచో చూస్తున్నాం.. అందరూ నన్ను ఫిట్ గా ఉన్నా అంటారు.. కానీ సత్య రాజ్ గారిని చూడండి ఎలా ఉన్నారో.. శ్రుతితో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. శోభిన్ అద్భుతమైన పాత్ర చేశాడు. మోనికా సాంగ్ లో శోభిన్ ఇరగదీశాడు. అలాగే చాలా మంది ఉన్నారు. రజినీకాంత్ గారితో పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను చూసి నువ్వు ఇలా ఉంటావని తెలిస్తే నిన్ను ఈ సినిమాలో వద్దు అని చెప్పేవాడిని అని సరదాగా అన్నారు అని చెప్పారు నాగ్. ఈ వయసులోనూ రజిని గారు సీన్స్ ను ప్రాక్టీస్ చేస్తుంటారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఆయన సీన్ చాలా ప్రాక్టిస్ చేశారు. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. 17 రోజులు ఒక షిప్ మీద షూట్ చేశాం. ఫైనల్ గా ఆ షూట్ చేసిన దాదాపు 300 మందికి రజినీకాంత్ గారు ఓ ప్యాకెట్ ఇచ్చి ఇంట్లో పిల్లలకి ఏదైనా తీసుకెళ్లండి అని చెప్పారు. అది ఆయన గొప్పతనం. ఇక అనిరుద్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. విలన్ గా నటించడం నాకు చాలా కొత్త అనుభూతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.