Vitamin-D: సప్లిమెంట్స్ ఎందుకు సూర్య రశ్మి ఉండగా.. ఏ సమయంలో విటమిన్ డి అధికంగా ఉంటుందంటే..

Vitamin-D: సప్లిమెంట్స్ ఎందుకు సూర్య రశ్మి ఉండగా.. ఏ సమయంలో విటమిన్ డి అధికంగా ఉంటుందంటే..


శరీరంలో విటమిన్-డి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, నిరాశ మొదలైన అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల విటమిన్-డి లోపాన్ని నివారించడం చాలా ముఖ్యం. అయితే నేటి బిజీ జీవితంతో పాటు కొన్ని రకాల అలవాట్లు కారణంగా చాలా మందిలో విటమిన్-డి లోపం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విటమిన్ సహజంగా లభిస్తుంది. సూర్య రశ్మి నుంచి శరీరానికి అందుతుంది. అయితే రోజులో ఏ సమయంలో (బెస్ట్ టైమ్ టు బూస్ట్ విటమిన్-డి) సూర్యరశ్మి తీసుకోవడం చాలా ప్రయోజనకరం అని ఆలోచిస్తున్నారా.. విటమిన్-డిని పెంచుకునేందుకు రోజులో మూడు గంటలు ఉత్తమ సమయం. ఆ సమయం ఏమిటో తెలుసుకుందాం.

విటమిన్ డి పెంచే ఉత్తమ సమయం

సూర్య కిరణాల నుంచి శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. కనుక ఈ విటమిన్ పొందడానికి సరైన సమయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సమయం విటమిన్ డి ని గ్రహించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో, UVB కిరణాలు అత్యధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి తాకినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది.

ఎండలో ఎంతసేపు కూర్చోవాలి?

తెల్లటి చర్మం ఉన్నవారు 15-20 నిమిషాలు పాటు ఎండలో కూర్చోవాలి. ఎందుకంటే వీరి చర్మం విటమిన్ డిని త్వరగా ఉత్పత్తి చేస్తుంది. అయితే నల్లటి చర్మం ఉన్నవారిలో విటమిన్ డిని ఉత్పత్తి అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే వీరి శరీరంలో అధిక మెలనిన్ కారణంగా విటమిన్ డి సులభంగా ఉత్పత్తి కాదు. అందువల్ల వీరు దాదాపు 30-40 నిమిషాలు ఎండలో కూర్చోవాలి.

ఇవి కూడా చదవండి

సూర్యరశ్మిలో కూర్చునే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

  1. ప్రత్యక్ష సూర్యకాంతిలో కూర్చోండి: గాజు తలుపులున్న కిటికీ వెనుక కూర్చోవడం వల్ల విటమిన్ డి లభించదు.
  2. శరీరంలో కనీసం 40% (చేతులు, కాళ్ళు, వీపు) ప్రత్యక్ష సూర్యకాంతి తగిలేలా కుర్చుకోవాలి.
  3. సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఎండలో కూర్చోవద్దు, ఎందుకంటే అది విటమిన్ డి శోషణను తగ్గిస్తుంది.
  4. ఎండలో ఎక్కువసేపు ఉండవద్దు. వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ సంభవించవచ్చు.
  5. విటమిన్ డి లోపం లక్షణాలు ఏమిటంటే
  6. శారీరకంగా అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది
  7. ఎముకలు, కీళ్ల నొప్పి సమస్యలతో ఇబ్బంది పడతారు.
  8. తరచుగా అనారోగ్యానికి గురి అవుతారు. జుట్టు రాలిపోతుంది.
  9. నిరాశగా ఉంటారు. మానసిక స్థితిలో మార్పులు
  10. శరీరానికి గాయాలు అయితే అవి మానడంలో జాప్యం జరుగుతుంది.

ఎవరైనా ఈ లక్షణాలను గమనించినట్లయితే.. వెంటనే విటమిన్ డి స్థాయి గురించి పరీక్షించుకోడానికి వైద్యుడిని సంప్రదించాలి. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొంత సమయం ఎండలో కూర్చోవడం విటమిన్ డి లోపాన్ని అధిగమించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు, గుడ్లు, చేపలు, పాలు, పుట్టగొడుగులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తినే ఆహారంలో చేర్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *