సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న కూలీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
శృతి హాసన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో నేను నటించడం నాకు చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.. ఆయన నాకు మంచి పాత్ర ఇచ్చారు. కూలీ సినిమాకు అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. రజినీకాంత్ గారితో నటిస్తాను అని అనుకోలేదు. నాగార్జున గారు అదరగొట్టేశారు. అలాగే సుమ అడిగిన కొన్ని క్రేజీ ప్రశ్నలకు శ్రుతి ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ప్రేక్షకులు లవ్ చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మీరు ఏది దొంగతనం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు ఎనర్జీ, చరిష్మా. ప్రభాస్ దగ్గర నుంచి ఫుడ్, అల్లు అర్జున్ దగ్గర నుంచి డాన్సింగ్. మహేష్ బాబు దగ్గర నుంచి స్టైల్ అండ్ గ్రెస్, బాలయ్య దగ్గర నుంచి హ్యూమర్, రజినీకాంత్ గారు దగ్గర నుంచి అన్ని దొంగతనం చేస్తా.. నాగార్జున దగ్గర నుంచి డైట్, ఫిట్ నెస్ అన్ని దొంగతనం చేస్తా అని అన్నారు శ్రుతి.
లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. నన్ను నమ్మిన రజినీకాంత్ గారిని ధన్యవాదాలు, అమీర్ ఖాన్ గారు, శోభిన్, సత్య రాజ్ ఉపేంద్ర గారుతో పాటు నాగార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో నాగార్జున గారు అద్భుతంగా నటించారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది నాగ్ సార్ ఎలా నటించారో.. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారు. రిలీజ్ తర్వాత ఆడియన్స్ కు అర్ధమవుతుంది. రజినీకాంత్, కమల్ సార్ ఇద్దరితో కలిసి చేశాను.. ఇద్దరూ లెజెండ్స్. తెలుగులో అందరు హీరోలతో కలిసి సినిమా చేస్తా అన్నారు లోకేష్. నేను కమిట్ అయిన సినిమాల తర్వాత తెలుగు హీరోలతో సినిమా చేస్తా..