Sesame Laddu: ఎముకల బలం కోసం మందులు ఎందుకు.. నువ్వుల లడ్డు తినండి.. తయారీ విధానం ఏమిటంటే..

Sesame Laddu: ఎముకల బలం కోసం మందులు ఎందుకు.. నువ్వుల లడ్డు తినండి.. తయారీ విధానం ఏమిటంటే..


నువ్వుల లడ్డు భారతీయ సాంప్రదాయ స్వీట్స్ లో ఒకటి. ఇది రుచి, ఆరోగయం పరిపూర్ణ కలయిక. ఈ పోషకమైన లడ్డులు వెచ్చదనం, శక్తిని అందిస్తాయి. ఐరెన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉన్న నువ్వుల లడ్డులు రుచికరమైనవి మాత్రమే కాదు.. చాలా పోషకాలను కూడా కలిగి ఉన్నాయి. ఈ నువ్వుల లడ్డులను తక్కువ పదార్ధాలతోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు సాంప్రదాయ స్వీట్ నువ్వుల ఉండల తయారీ విధానం తెలుసుకుందాం..

నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు

  1. తెల్ల నువ్వులు – 1 కప్పు
  2. బెల్లం – ¾ కప్పు (తురిమిన లేదా ముక్కలుగా తరిగి)
  3. నెయ్యి – 1 టేబుల్ స్పూన్
  4. యాలకుల పొడి – ½ టీస్పూన్ (ఐచ్ఛికం)
  5. వేయించిన వేరుశనగ గుళ్ళు లేదా ఎండు కొబ్బరి – 2-3 టేబుల్ స్పూన్లు
  6. తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి… తక్కువ వేడి మీద నువ్వులను వేయించుకోవాలి.
  7. నువ్వులు వేగి.. అవి పగిలి బంగారు రంగులోకి మారే వరకు (3-4 నిమిషాలు) వేయించాలి.
  8. తర్వాత ఈ నువ్వులను పాన్ నుంచి ఒక ప్లేట్ లోకి మార్చుకుని చల్లబరిచేందుకు ఒక పక్కన పెట్టుకోండి.
  9. అదే పాన్ లో వేరు శనగ గుళ్ళు వేసి వేయించండి.
  10. ఇంతలో బెల్లం సిరప్ తయారీ చేసుకునేందుకు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, తురిమిన బెల్లం వేయండి.
  11. తక్కువ మంట బెల్లం కరిగించి మెత్తని సిరప్ అయ్యే వరకు నిరంతరం కలుపుతూ ఉండండి.
  12. లడ్డుకి సరిపడా బెల్లం పాకం వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఒక ప్లేట్ తీసుకుని అందులో చల్లటి నీరు వేసి కొంచెం సిరప్ వేయండి.
  13. ఆ బెల్లం పాకం గట్టిగా ముద్దగా ఏర్పడితే బెల్లం సిరప్ సిద్ధం అయినట్లే..
  14. ఇప్పుడు ఆ బెల్లం సిరప్ లో వేయించిన నువ్వులు, వేయించిన వేరుశనగలు వేసి త్వరగా త్వరగా కలపండి.
  15. ఈ మిశ్రమంలో యాలకుల పొడి వేసి.. సిరప్ వేడిగా ఉన్నప్పుడే అన్నీ బాగా కలిసేలా కలపండి.
  16. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా ఈ మిశ్రమాన్ని చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత తడి తగలని సీసాలో నిల్వ చేసుకోండి. అంతే నువ్వుల లడ్డులు రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *