రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్య రాజ్, శ్రుతిహాసన్ ఇలా చాలా మంది నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ వీడియో ద్వారా మాట్లాడారు.
వీడియో ద్వారా సూపర్ స్టార్ మాట్లాడుతూ.. తెలుగులో అదరగొట్టారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 50ఏళ్లు. తెలుగులో రాజమౌళి ఎలానో తమిళ్ లో లోకేష్ కనగరాజ్ అలా.. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమా స్పెషల్ గెస్ట్ గా నటిస్తున్నారు. అన్నిన్నిటికంటే పెద్ద సర్ ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నారు. కథ విన్నప్పుడు నేనే విలన్ గా చేయాలనీ అనుకున్నా.. అంత పవర్ ఫుల్ పాత్ర అది. అయితే కూలీ సినిమాలో విలన్ ఎవరు నటిస్తారా అని అనుకున్నా.. లోకేష్ వచ్చి నాగార్జున చేస్తున్నారు అని అన్నారు నేను షాక్ అయ్యాను.
నాగార్జున చేస్తున్నారు అని చెప్పడంతో నేను షాక్ అయ్యా.. 33 ఏళ్ల క్రితం నాగార్జునతో ఓ సినిమా చేశా.. అప్పుడు నాగ్ ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ చూసి ఆయనను అడిగాను .. ఇలా ఎలా ఉండగలరు అని.. ఆయన సింపుల్ గా వర్కౌట్స్ చేస్తాను. స్విమింగ్ చేస్తా.. అలాగే మా నాన్న గారి జీన్స్ అని చెప్పారు .. వీటితో పాటు నేను ఏదీ మనసులోకి తీసుకొను అని అన్నారు. అది ఆయన సీక్రెట్. నాగార్జున గారితో గడిపిన రోజులను నేను లైఫ్ లో మర్చిపోలేను అన్నారు రజినీకాంత్.