ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిని పట్టిపీడిస్తోంది.. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారం, ఊబకాయం చెడు జీవనశైలి అలవాట్లతో పోరాడుతున్న వారిలో కొవ్వు కాలేయ సమస్య చాలా సాధారణం అవుతోందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.. అయితే, ఈ సమస్యతో బాధపడుతున్నవారు చక్కెర తీసుకోవడం తగ్గించడం ద్వారా ఫ్యాటీ లివర్ ను తగ్గించవచ్చా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది..? అవును, ఖచ్చితంగా. శాస్త్రీయ, వైద్య పరిశోధనలు చక్కెర, ముఖ్యంగా ఫ్రక్టోజ్, కొవ్వు కాలేయానికి ప్రధాన కారణాలలో ఒకటి అని నిరూపించాయి.. తీపి పదార్థాలను దూరం పెట్టడం ద్వారా ఈ సమస్యను కాస్త తగ్గించవచ్చని.. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చని పేర్కొంటున్నారు.
కొవ్వు కాలేయం – చక్కెర మధ్య సంబంధం ఏమిటి?
ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. కాలేయం అవసరమైన దానికంటే ఎక్కువ కొవ్వును నిల్వ చేయడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది.
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) – ఈ వ్యాధి మద్యం తాగని వ్యక్తులలో సంభవిస్తుంది.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) – అధికంగా మద్యం సేవించే వారిలో ఈ వ్యాధి సాధారణం.
NAFLD కి అతిపెద్ద కారణం అనారోగ్యకరమైన ఆహారం.. ఇందులో ఎక్కువ చక్కెర తీసుకోవడం.. ముఖ్యంగా అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్.. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉంటాయి. మనం ఎక్కువ చక్కెర తిన్నప్పుడు, అది శరీరంలో గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్‌లుగా మారి కాలేయంలో పేరుకుపోతుంది. ఈ కొవ్వు పేరుకుపోయి కొవ్వు కాలేయానికి కారణమవుతుంది.
చక్కెర (స్వీట్ పదార్థాలు) తగ్గించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా?
చక్కెర తగ్గించడం వల్ల కాలేయానికి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ ఆహారం నుండి అదనపు చక్కెరను తగ్గించినప్పుడు, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం క్రమంగా తగ్గుతుంది.. శరీరం ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది.. వాపు తగ్గుతుంది.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. ఇది కొవ్వు కాలేయ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చక్కెర తగ్గాలంటే ఏం చేయాలి?
1. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్ వంటి తీపి పానీయాలకు దూరంగా ఉండండి.
2. స్వీట్లు, బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు వంటి ప్రాసెస్ చేసిన వస్తువులను తక్కువగా తినండి.
3. ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, జోడించిన చక్కెర మొత్తాన్ని ఖచ్చితంగా చదవండి. తక్కువగా ఉన్న వాటిని కొనుగోలు చేయండి..
4. బెల్లం, తేనె, ఖర్జూరం వంటి సహజ తీపి ఎంపికలను పరిమిత పరిమాణంలో తీసుకోండి.
5. వీలైనంత ఎక్కువ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోండి.
ఈ విషయాలను అర్థం చేసుకోండి:
మీరు కొవ్వు కాలేయాన్ని వదిలించుకోవాలనుకుంటే.. మొదటి అడుగు చక్కెర తీసుకోవడం తగ్గించడం. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మధుమేహం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులను కూడా నివారిస్తుంది. కాబట్టి స్వీట్లను నియంత్రించండి.. కాలేయాన్ని ఆరోగ్యంగా మార్చుకోండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..