Akshay Kumar: అక్షయ్ కుమార్‌కు ఏమైంది? 7 నెలల్లో 110 కోట్ల ఆస్తులను అమ్మేసిన స్టార్ హీరో.. అసలు కారణమదేనా?

Akshay Kumar: అక్షయ్ కుమార్‌కు ఏమైంది? 7 నెలల్లో 110 కోట్ల ఆస్తులను అమ్మేసిన స్టార్ హీరో.. అసలు కారణమదేనా?


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ మధ్యన తన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఆస్తుల విక్రయాల విషయంలో ఈ నటుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గత ఏడు నెలల్లో ముంబై లో తనకున్న ఎనిమిది ఆస్తులను విక్రయించారు అక్షయ్. వీటి ద్వారా రూ. 110 కోట్లు సంపాదించారు. ఇందులో బోరివాలి, వర్లి, లోయర్ పరేల్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు ఉన్నాయి. అక్షయ్ తన ఆస్తులన్నీ అమ్మేయడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. దీని గురించి బాలీవుడ్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అక్షయ్ ముంబై ను వీడి వేరే చోట నివసించేందుకు ప్లాన్ చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. జనవరి 21, 2025న, అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివలిలో 3BHK అపార్ట్‌మెంట్‌ను రూ.4.25 కోట్లకు అమ్మేశాడు. ఈ అపార్ట్‌మెంట్ ఒబెరాయ్ స్కై సిటీ ప్రాజెక్ట్‌లో ఉంది. అక్షయ్ ఈ అపార్ట్‌మెంట్‌ను నవంబర్ 2017లో రూ.2.38 కోట్లకు కొనుగోలు చేశాడు.

అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా జనవరి 31, 2025న ముంబైలోని వర్లిలోని ఒబెరాయ్ త్రీ సిక్స్టీ వెస్ట్ ప్రాజెక్ట్‌లోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మారు. దీని ద్వారా రూ. 80 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఇల్లు భవనంలోని 39వ అంతస్తులో ఉంది. దీంతో పాటు నాలుగు పార్కింగ్ స్లాట్‌లను కూడా విక్రయించారు. ఈ ఏడాది మార్చిలో, అక్షయ్ బోరివాలి తూర్పులోని ఒబెరాయ్ స్కై సిటీలోని ఒక అపార్ట్‌మెంట్‌ను రూ.4.35 కోట్లకు విక్రయించాడు. అందులోనూ రెండు పార్కింగ్ స్లాట్‌లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే ఏప్రిల్‌లో ముంబైలోని లోయర్ పరేల్‌లోని ఒక కమర్షియల్ అపార్ట్ మెంట్ ను రూ.8 కోట్లకు అమ్మేశాడు. అక్షయ్ 2020లో ఈ ఆస్తిని రూ.4.85 కోట్లకు కొనుగోలు చేశాడు. దీనిపై అతనికి 65 శాతం లాభం వచ్చింది. ఇక ఏప్రిల్‌లో ముంబైలోని లోయర్ పరేల్‌లోని ఒక వాణిజ్య ఆస్తిని రూ.8 కోట్లకు అమ్మేశాడు. అక్షయ్ 2020లో ఈ ఆస్తిని రూ.4.85 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇలా అక్షయ్ ఆస్తుల అమ్మకాలపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అక్షయ్ చేసిన సినిమాలు విజయాలు సాధించడం లేదని, ఆర్థిక ఇబ్బందులతోనే ఇలా ఆస్తులు విక్రయిస్తున్నాడని చెబుతున్నారు. అలాగే ముంబైను వీడి వేరే చోట నివసించేందుకు అక్షయ్ ప్లాన్ చేస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

కన్నప్ప సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *