
చాలా మంది హీరోల్లాగే ఇతను కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పుడే స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 60 సినిమాల్లో చేశానని ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడీ స్టా్ యాక్టర్. ఇక కొన్ని సినిమాల్లో హీరోగానూ మెప్పించాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
ఓ పక్క సినిమాలు చేస్తూనే అడపాదడపా సీరియల్స్‌లోనూ యాక్ట్ చేశాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమై పోయాడు. చాలా ఏళ్ల పాటు కెమెరాకు దూరంగా ఉండిపోయాడు. అయితే ఈ మధ్యే మళ్లీ దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. అదే సమయంలో పెళ్లి, విడాకులు, రిలేషన్ షిప్ విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే 60 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ వస్తున్నాడు. ఇంతకీ అతనెవరో గుర్తు పట్టారా? పెళ్లి సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన బబ్లూ పృథ్వీరాజ్.
గతంలో పెళ్లి, పెళ్లి పందిరి, కంటే కూతుర్నే కనాలి, దేవుళ్లు, సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, గౌతమ్ ఎస్ఎస్ఎస్సీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు పృథ్వీ. అయితే ఆ తర్వాత మాయమైపోయాడు. మళ్లీ యానిమల్ సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత ఆయన మరింత స్పీడ్ పెంచాడు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, లైలా, జాట్, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ, ఏస్, ఓ భామ అయ్యో రామ, ట్రైన్ వంటి సినిమాల్లో నటించాడు.
జాట్ సినిమా షూటింగ్ లో పృథ్వీ రాజ్..
View this post on Instagram
ఇక వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పృథ్వీరాజ్ గతంలో బీనాను పెళ్లాడాడు. వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు ఆటిజంతో బాధఫడుతున్నాడు. బీనాతో విడాకులు తీసుకున్న పృథ్వీ ఆ మధ్యన తెలుగమ్మాయి శీతల్‌తో సహజీవనం చేశాడు. తర్వాత ఆమెతో కూడా బ్రేకప్ అయ్యాడు. ప్రస్తుతం సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు పృథ్వీ.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తో బబ్లూ పృథ్వీ రాజ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..