RCB: కోహ్లీ మాజీ టీంమేట్ సంచలన నిర్ణయం.. OnlyFansలో చేరానంటూ పోస్ట్..

RCB: కోహ్లీ మాజీ టీంమేట్ సంచలన నిర్ణయం.. OnlyFansలో చేరానంటూ పోస్ట్..


Tymal Mills: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ ఆటగాడు, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ తైమల్ మిల్స్, ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు. ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన ఆయన, అడల్ట్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఎక్కువగా పేరున్న ‘ఓన్లీఫ్యాన్స్’లో అకౌంట్ తెరిచారు. అయితే, ఆయన ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారనే విషయంలో స్పష్టత ఇచ్చారు.

ఓన్లీఫ్యాన్స్‌లో తాను ఏ రకమైన కంటెంట్ పోస్ట్ చేయబోతున్నాడనే విషయంపై మిల్స్ మాట్లాడుతూ, అది పూర్తిగా క్రికెట్, తన వ్యక్తిగత జీవనం (Lifestyle) గురించేనని చెప్పారు. ఇక్కడ ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదని, కేవలం తన అభిమానులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి, తన క్రికెట్ జీవితం గురించి తెలియజేయడానికే ఈ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నానని వివరించారు.

క్రికెటర్ల జీవితం కేవలం మైదానంలో కనిపించే ఆటతోనే ముడిపడి ఉండదని, ఆటగాళ్ల ప్రయాణం, అనుభవాలు, మానసిక స్థితి వంటి అనేక విషయాలు ఉంటాయని మిల్స్ తెలిపారు. మీడియాలో వచ్చే ఇంటర్వ్యూలు చాలా సాధారణంగా, కొన్నిసార్లు ప్రణాళికబద్ధంగా ఉంటాయని, కానీ ఓన్లీఫ్యాన్స్‌లో తాను నిష్పాక్షికంగా మాట్లాడగలనని, తన భావాలను, ఆలోచనలను అభిమానులతో పంచుకోగలనని మిల్స్ చెప్పారు.

ఇంతకుముందు స్పోర్ట్స్ జర్నలిజం విద్యను అభ్యసించిన మిల్స్, BBC, Sky Sports, TalkSPORT వంటి సంస్థలతో పనిచేశారు. ఇది తనలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి ఉపయోగపడిందని, ఇప్పుడు ఈ అనుభవాన్ని ఓన్లీఫ్యాన్స్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరగా తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కొత్త ప్రయత్నంపై తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఈ ప్లాట్‌ఫామ్‌లో క్రికెట్ కంటెంట్‌కు ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నానని మిల్స్ చెప్పారు. తన ఓన్లీఫ్యాన్స్ అకౌంట్‌లో సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఉచితం అని, కొన్ని ప్రత్యేకమైన కంటెంట్‌కు మాత్రమే స్వల్ప మొత్తంలో రుసుము వసూలు చేస్తామని మిల్స్ తెలిపారు.

ప్రస్తుతం ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో సదరన్ బ్రేవ్ తరపున ఆడుతున్న మిల్స్, తన ఇంగ్లాండ్ కెరీర్ దాదాపు ముగిసిందని భావిస్తున్నప్పటికీ, తాను చేసే ప్రతి పనిలోనూ పూర్తి శ్రద్ధ పెడతానని, ఓన్లీఫ్యాన్స్‌లో కూడా అదే ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు. మొత్తానికి, తైమల్ మిల్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *