Chanakya Niti: డబ్బు పొదుపు చేయడం ఒక కళ అన్న చాణక్య.. ఈ విధానాలు అమలు చేస్తే జీవితంలో డబ్బుకి కొరత ఉండదన్న చాణక్య

Chanakya Niti: డబ్బు పొదుపు చేయడం ఒక కళ అన్న చాణక్య.. ఈ విధానాలు అమలు చేస్తే జీవితంలో డబ్బుకి కొరత ఉండదన్న చాణక్య


ప్రతి ఒక్కరికీ డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే ఆందోళనకు లోనవుతారు. ఇదే విషయాన్ని ఆచార్య చాణక్య వేల సంవత్సరాల క్రితమే డబ్బులు దాచేందుకు కొన్ని విధానాలను చెప్పాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఎవరైనా సరే ఆర్థికంగా బలంగా మారవచ్చు. చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలు నేటికీ అంతే ఖచ్చితమైనవి. ప్రభావవంతమైనవి. సంపద కష్టపడి పనిచేయడం వల్లనే కాదు, తెలివితేటలు, సరైన విధానం వల్ల కూడా వస్తుందని చాణక్య నమ్మాడు. కనుక మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులకు ఇబ్బంది పడకూడదు అని మీరు కోరుకుంటే.. చాణక్యుడు చెప్పిన ఈ ఐదు విధానాలను ఖచ్చితంగా తెలుసుకోండి.

డబ్బులను పొడుపు చేయండి
మీరు సంపాదించిన మీ సంపద గురించి ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే మీ సంపాదన గురించి ప్రజలు అసూయపడతారు. ఒకొక్కసారి మీకు హాని కలిగించవచ్చు. కనుక మీరు సంపాదన గురించి, ఆర్థిక పరిస్థితిని వీలైనంత రహస్యంగా ఉంచండి.

తెలివిగా ఖర్చు చేయండి
చాణక్యుడి నీతి శాస్త్రంలో చెప్పిన ప్రకారం డబ్బును అవసరమైనప్పుడు మాత్రమే వాడండి. వృధా ఖర్చులను చేయవద్దు. డబ్బు ఆదా చేయడం ధనవంతులు కావడానికి మొదటి మెట్టు.

ఇవి కూడా చదవండి

ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు
మీరు సంపాదించిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు చేయవద్దని చాణక్య స్పష్టంగా చెప్పాడు. ఆదాయం కంటే అధికంగా డబ్బులు ఖర్చు చేయడం వలన అప్పులు చేసే స్థితికి నెట్టివేస్తుంది. మానసిక సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. కనుక సంపాదనకు తగిన విధంగా ఖర్చులు మాత్రమే చేయాలి.

డబ్బు సంపాదించే తెలివి
డబ్బులు సంపాదించే తెలివి తేటలు ఉన్నవారు ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా డబ్బు సంపాదిస్తారని చాణక్యుడు నమ్మాడు. కనుక ఎటువంటి సమయాల్లో డబ్బు సంపాదన చేసే విధానాన్ని నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి.

కష్ట సమయాల్లో ఆదుకునే పొదుపు
చాణక్య నీతి ప్రకారం మంచి రోజులు ఎప్పుడూ ఎవరికీ శాశ్వతంగా ఉండవు. కనుక మీకు డబ్బు వచ్చినప్పుడల్లా.. దానిలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. ఇలా పొడుపు చేయడం వలన ఆ డబ్బులు కష్ట సమయంలో ఆర్ధికంగా మద్దతుగా నిలుస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *