2025 Highest Grossing Crime Thriller Film: మీరు క్రైమ్-థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడితే, 2025 సంవత్సరంలో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా మొదలైన తొలి నిమిషంలోనే ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ సినిమాను ఒకసారి చూడటం ప్రారంభిస్తే, క్లైమాక్స్ వరకు అలాగే చూస్తుండిపోతారు. ఈ సినిమా పేరు ‘ఐడెంటిటీ’.
‘ఐడెంటిటీ’ 2 గంటల 37 నిమిషాల నిడివి గల మలయాళ సినిమా.. ఇది తమిళం, తెలుగు, హిందీ, కన్నడ వంటి భాషలలో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం IMDbలో 7.3 రేటింగ్‌ను పొందింది. ‘ఐడెంటిటీ’ కథ ఒక పోలీసు అధికారి, స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది.
ఈ సినిమాలో కొత్త పజిల్స్ వారిద్దరినీ గందరగోళానికి గురి చేస్తాయి. ఇది సాధారణ హత్య కాదని, ఛేదించడానికి చాలా కష్టమైన కుట్ర అని వారిద్దరూ గ్రహిస్తారు. టోవినో థామస్, త్రిష కృష్ణన్, మందిరా బేడి, అజు వర్గీస్, గోపికా రమేష్ వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించారు.
దాదాపు రూ. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ మలయాళ చిత్రం.
సస్పెన్స్-థ్రిల్లర్ తో పాటు, ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉంది. మీరు OTT లో ఇంట్లో కూర్చొని హాయిగా ఆనందించవచ్చు. ఈ సినిమా దేశంలో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో ఉంది. సినిమా మొదలైన తొలి నిముషం నుంచి క్లైమాక్స్ వరకు సీన్ సీన్‌కు ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..