SSC CGL 2025 Exam Date: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష

SSC CGL 2025 Exam Date: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష


హైదరాబాద్‌, ఆగస్టు 4: దేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను రిజర్వేషన్ల వారీగా విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కింది లింక్‌ ద్వారా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ఖాళీల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అయితే, ఈ జాబితాలో రాష్ట్ర, జోన్ వారీగా ఖాళీల గురించి ప్రస్తావించలేదు. రిజర్వేషన్ వర్గాల ఆధారంగా మాత్రమే పేర్కొంది. ఇది తాత్కాలికమైనదని, తుది ఫలితాల ప్రకటన తర్వాత సవరించే అవకాశం ఉందని కమిషన్‌ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌ నెలలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ సీజీఎల్‌ నోటిఫికేషన్‌లో మొత్తం 14,582 గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి టైర్‌ 1 పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 13 నుంచి 30 వరకు నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి టైర్‌ 2 పరీక్షను డిసెంబర్‌లో నిర్వహిస్తారు.

తెలంగాణ సీపీగెట్‌ 2025 కేటగరీల వారీగా ఖాళీల జాబితా కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ సీపీగెట్‌ 2025 ప్రవేశ పరీక్షలు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్‌ పరీక్షలు ప్రారంభమైనాయి. మొత్తం 44 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్నాయి. ఆగస్టు 11, 2025వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63,100 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *