అవకాడో పోషకాలు దండిగా ఉండే పండు. ఇది మహిళల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అవకాడోలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇది పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడంలోనూ సహాయపడుతుంది. మహిళలకు అవకాడో వల్ల కలిగే ఇతన ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..
అవకాడో చర్మానికి మేలు చేస్తుంది. అవకాడోలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు) అధికంగా ఉంటాయి. ఇవి మహిళల హార్మోన్లను సమతుల్యం చేయడంలో ఉపయోగపడతాయి.
గర్భధారణకు కూడా అవకాడో మంచిది. అవకాడోలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పిండం అభివృద్ధికి సహాయపడుతుంది.
గుండెకు మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. అవకాడోలో ఎముకల బలానికి అవసరమైన విటమిన్ కె, కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.