టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. భారీ స్టార్ క్యాస్టింగ్ లు, అబ్బురపరిచే వీఎఫ్ఎక్స్ హంగులు, యాక్షన్ సీక్వెన్సులతో సినిమాలను నింపేస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ లో ఒక చిన్న సినిమా అద్బుతాలు చేసింది. స్టార్ హీరో, హీరోయిన్స్, వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా ఏమీ లేకుండానే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పెద్దగా ప్రమోషన్స్ లేనప్పటికీ వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది. నేషనల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ అంటూ భారీ తనానికే పెద్ద పీటవేస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లోనూ కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపించిన ఆ సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు సైయారా.
బాలీవుడ్ లో లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలకు పేరుగాంచిన దర్శకుడు మోహిత్ సూరి ‘సైయారా మూవీ ‘ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ పరిశ్రమకు ఇద్దరు కొత్త ముఖాలు అహన్ పాండే, అనిత్ పద్దాలను పరిచయం చేశారు. అహన్ పాండే క్రేజీ హీరోయిన్ అనన్య పాండే కు సోదరుడు అవుతాడు. ఇక అనిత్ గతంలో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. ఇప్పటికీ సైయారా సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతోంది. అదే సమయంలో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని డీల్ కుదిరిందని సమాచారం. దీని ప్రకారం ఆగస్టు ఆఖరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇవి కూడా చదవండి
#SaiyaaraTitleTrack found its home in your hearts! 200M+ views ✨❤️🎶 Watch the song now – https://t.co/pkhNGTgO3c#Saiyaara in cinemas. #AhaanPanday | #AneetPadda | @mohit11481 | #AkshayeWidhani | #FaheemAbdullah | #TanishkBagchi | #ArslanNizami | @Irshad_Kamil | @vijayganguly pic.twitter.com/OBc4sq55ms
— Yash Raj Films (@yrf) August 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.