Gold Price Today: అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు బంగారు అభరణాల మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు అకస్మాత్తుగా పెరగడం జరుగుతుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ తులం ధర లక్ష రూపాయలకుపైగానే ఉంది. దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వెండి ధర కూడా అందే అది కూడా అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. GST జోడించకుండానే బంగారం రూ. లక్ష దాటింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని, వెండి మరింత చౌకగా మారవచ్చని కొందరు అంటున్నప్పటికీ అదేమి తగ్గకుండా లక్షకుపైగానే దూసుకుపోతోంది.
ఇది కూడా చదవండి: Auto Tips: మీ వాహనాన్ని ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారా? ముందు ఇవి తెలుసుకోండి!
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ఇవి కూడా చదవండి
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 వద్ద ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,040 వద్ద ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01340 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,890 వద్ద ఉంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే కిలో వెండి ధర 1 లక్ష 12,900 రూపాయలు ఉంది.
బంగారం, వెండి ధరలు చాలా కాలంగా ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో డాలర్ బలం కారణంగా కొంత ఒత్తిడి ఉంది. కానీ ట్రంప్ వాణిజ్య యుద్ధ విధానం కారణంగా, పెట్టుబడిదారులు ఇప్పటికీ బంగారం, వెండిని ‘సురక్షిత పెట్టుబడి’గా గమనిస్తున్నారు.
గత 20 ఏళ్లలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. 2005లో 10 గ్రాములకు రూ. 7,638 ఉన్న బంగారం, ఆగస్ట్ 4, 2025 నాటికి రూ.1 లక్ష దాటింది . వెండి కూడా కిలోకు రూ. 1 లక్ష కంటే ఎక్కువగానే ఉంది. అంటే, దీర్ఘకాలికంగా, ఈ రెండు లోహాలు పెట్టుబడిదారులకు గొప్ప రాబడిని ఇచ్చాయి.
ఇది కూడా చదవండి: Bike Servicing: బైక్‌ను ఎన్ని కి.మీ తర్వాత సర్వీస్ చేయాలి? సరైన సమయం ఏది?
ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి