Ramchander Rao: నాలో ఫైర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. ఈటల, బండి మధ్య గొడవకు కారణమేంటీ..?

Ramchander Rao: నాలో ఫైర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. ఈటల, బండి మధ్య గొడవకు కారణమేంటీ..?


కరీంనగర్‌లో విభేదాలే తప్ప వర్గపోరు లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. ఈటలపై ఎక్కడా వ్యతిరేక పోస్టులు రాలేదని.. ఆయనతో అన్ని విషయాలు చర్చించినట్లు తెలిపారు. టీవీ9 క్రాస్‌ఫైర్‌లో కీలక విషయాలపై ఆయన మాట్లాడారు. వలసనేతలకు పార్టీలో అవకాశాలు లేవు అనేది అవాస్తవమని.. ఏ పార్టీ నాయకులైన బీజేపీలో చేరొచ్చని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని.. ముస్లిం మైనార్టీలను బీసీ కోటాలోకి తేవడం కరెక్ట్ కాదన్నారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు వాటి ఇస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని.. మరికొన్ని రోజుల్లో పార్టీ స్వరూపమే మారిపోతుందని వ్యాఖ్యానించారు. హైడ్రాకు వ్యతిరేకంగా ఎక్కువ పోరాడింది బీజేపీయేనని.. హైడ్రాపై ఈటల తీసుకున్న స్టాండ్ బీజేపీదేనని చెప్పారు. కుల ఆధారాంగా బీజేపీలో నియామకాలు ఉండవన్నారు. తనలో ఫైర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని.. పైకి మాత్రమే కామ్‌గా కనిపిస్తానని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *