Watch Video: డ్రైవర్‌ నిర్లక్ష్యం.. జనాలపైకి దూసుకొచ్చిన బొలెరో.. అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ..

Watch Video: డ్రైవర్‌ నిర్లక్ష్యం.. జనాలపైకి దూసుకొచ్చిన బొలెరో.. అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ..


బారా పట్టణంలోని మేల్ఖేడి రోడ్డులో ఒక బోలేరో వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కనున్న దుకాణాల, జనాలపైకి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా రోడ్డుపై వెళ్తున్న బైక్‌ను కూడా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి స్వల్పంగా గాయపడింది. చిన్నారి తండ్రి తన కూతురికి అనారోగ్యంగా ఉండడంతో డాక్టర్‌కు చూపించి గ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ చైన్ తెగిపోవడంతో పక్కనే ఉన్న మెకానిక్ వద్ద బైక్‌ను ఆపి తండ్రి మరమ్మతు చేయిస్తున్నాడు. అదే సమయంలో ఓ బాలెరో వాహనం రోడ్డుపై అదుపు తప్పి, అక్కడ ఉన్న వారిపైకి దూసుకొచ్చింది. డ్రైవర్‌ కనీసం వాహనాన్ని నిలిపే ప్రయత్నం కూడా చేయలేదు. జనాలను గుద్దుకుండూ అలానే ముందుకు వెళ్లిపోయి.. అక్కడి నుంచి పారిపోయాడు.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కోత్వాలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసులు బొలేరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే డ్రైవర్‌ పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కోత్వాలి స్టేషన్ సీఐ యోగేశ్ చౌహాన్ మీడియాకు తెలిపారు. వాహనాన్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారో, ప్రమాదానికి అసలైన కారణాలు ఏమిటో అన్వేషణ కొనసాగుతోందని చెప్పారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అందులో డ్రైవర్ ఏమాత్రం జాగ్రత్తలు పాటించకుండా, రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీకొడుతూ ముందుకు వెళ్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతున్నాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి తీరుపై మరింతగా కట్టడి అవసరమవుతోంది.

వీడియో చూడండి..

సామాన్య ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నారి గాయపడిన ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర మానసిక వేదనలో ఉంది. తమకు న్యాయం జరగాలని, డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు కోరుతున్నారు. పోలీసులు, స్థానిక పాలకులు బాధిత కుటుంబానికి న్యాయం చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నది ప్రజల ఆకాంక్ష. ఈ సంఘటన భవిష్యత్తులో మరెవరికీ జరగకుండా ఉండాలంటే, వాహనదారులపై నియంత్రణ, రోడ్డు భద్రత పట్ల బాధ్యత వహించే విధానం మరింత పటిష్టం కావాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *