అది పుల్లగా ఉండటంతో ఆయన ఓ రకమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇంతలో ఓ గాడిద అక్కడికి వచ్చింది. నిమ్మకాయ తింటున్న వ్యక్తికి దగ్గరగా వచ్చి తనకు కూడా పెట్టమన్నట్లుగా నిలుచుంది. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న మరో నిమ్మకాయ ముక్కను గాడిద నోట్లో పెట్టాడు. మొదట కొన్ని సెకన్ల పాటు తినటానికి ఏదో మంచి పండు దొరికిందన్నట్లుగా అది ఆనందంతో నమరడం మొదలుపెట్టింది. తీరా నోటికి పులుపు తగిలేసరికి దాని రియాక్షన్ మారిపోయింది. యాక్తూ అన్నట్లుగా విన్త ఎక్స్ ప్రెషన్స్ పెట్టి చివరికి ఆ నిమ్మకాయను ఉమ్మేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని ఇప్పటికే 23 లక్షల మందికి పైగా లైక్ చేస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు.