తాంత్రికుడి మాటలు నమ్మి.. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. బలి ఇచ్చిన సొంత మేనమామ!

తాంత్రికుడి మాటలు నమ్మి.. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. బలి ఇచ్చిన సొంత మేనమామ!


ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతంలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. భలువాని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పత్ఖౌలి గ్రామానికి చెందిన 9 ఏళ్ల ఆరుష్ గౌర్‌ను నాలుగు నెలల క్రితం నిందితులు చేతబడి కోసం కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ తర్వాత, బంధువులే అమాయక బిడ్డను బలి ఇచ్చి దారుణంగా హత్య చేశారు. ఆ బిడ్డను అతని దగ్గరి బంధువులు చంపారని పోలీసులు తెలిపారు. అమాయక చిన్నారి హత్యలో ప్రమేయం ఉన్న సొంత మేనమామతో సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

2024లో దేవరియా జిల్లా భలువాని పత్ఖౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పరశురామ్ గౌర్ కుమార్తె శంభాను ఇంద్రజిత్ గౌర్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత అతను తన అత్తమామల ఇంటికి వెళ్ళిపోయాడు. అతనికి దేవత ఆవహించిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. అతను అనారోగ్యానికి గురయ్యాడు. దీని గురించి అతని అత్తమామలు ఆందోళన చెంది, భూతవైద్యం కోసం సోఖాకు తీసుకెళ్లారు. అక్కడ తాంత్రికుడు నరబలి ఇవ్వడంతో రోగం నయమవుతుందని చెప్పాడు. దీంతో రాత్రిపూట తోటలో పూజలు నిర్వహించి తొమ్మిదేళ్ల బాలుడిని కత్తితో గొంతు కోసి చంపారు. మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన నిందితుడు సోఖా ఇంద్రజిత్, భీమ్ గౌర్ లతో కలిసి మృతదేహాన్ని బయటకు తీశారు. దానిని ఒక సంచిలో వేసి పికప్ వాహనంలో తీసుకెళ్లి బర్హాజ్‌లోని గౌరాఘాట్ వద్ద నదిలో విసిరేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 17న, తన మేనల్లుడు ఆరుష్ గౌర్ అదృశ్యం గురించి, సోమనాథ్ గౌర్ ఏప్రిల్ 17న ఒక ఫిర్యాదు దాఖలు చేశారని డియోరియా ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా జైప్రకాష్ గౌర్, ఇంద్రజిత్ గౌర్, భీమ్ గౌర్, రామశంకర్ అలియాస్ శంకర్ గౌర్ తోపాటు బాలుడి దగ్గరి బంధువులు ఉన్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. వారంతా బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత నిందితులు అమాయక బాలుడిని బలి ఇచ్చారు. మృతదేహాన్ని నదిలో పడేశారు. పోలీసుల విచారణలో నలుగురు నిందితులు నేరం అంగీకరించారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *