చేసింది 4 సినిమాలు.. ఒక్క హిట్టు లేదు.. టాప్ క్రికెటర్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ బ్యూటీ ఎవరంటే..

చేసింది 4 సినిమాలు.. ఒక్క హిట్టు లేదు.. టాప్ క్రికెటర్‏ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఈ బ్యూటీ ఎవరంటే..


సినీరంగంలో తనదైన ముద్ర వేయాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తండ్రి సూపర్ స్టార్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ తండ్రి సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆయన బాటలోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. చేసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. దీంతో ఆమె సినిమాను వదిలిపెట్టింది. కెరీర్ ఫాంలో ఉండగానే టీమిండియా టాప్ క్రికెటర్ తో ప్రేమలో పడింది. చివరకు పెద్దల సమక్షంలో అతడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?ఆ హీరోయిన్ మరెవరో కాదండి.. అతియా శెట్టి.

ఇవి కూడా చదవండి: Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తెరంగేట్రం చేసింది. యంగ్ హీరో సూరజ్ పంచోలితో కలిసి హీరో సినిమాతో నటిగా పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. రెండేళ్ల విరామం తర్వాత అర్జున్ కపూర్ సరసన ముబారకన్ చిత్రంలో నటించింది. ఇందులో ఇలియానా సైతం కీలకపాత్రలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన మోతీచూర్ చక్నాచూర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. వరుస సినిమాలు ప్లాప్స్ కావడంతో అతియాకు అంతగా అవకాశాలు రాలేదు. భారతదేశంలోని ప్రముఖ సామాజిక వాణిజ్య వేదిక స్టేజ్ 3లో పెట్టుబడి పెట్టి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

కెరీర్ ఫాంలో ఉండగానే టీమిండియా క్రికెటర్ KL రాహుల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2023లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇటీవలే పండంటి పాప జన్మించింది. నివేదికల ప్రకారం KL రాహుల్‌ నికర విలువ రూ.101 కోట్లు.

 ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *