Saina Nehwal: సైనా నెహ్వాల్‌ సంచలన పోస్ట్‌..! దూరమైతే బంధం విలువ తెలుస్తుందంటూ..

Saina Nehwal: సైనా నెహ్వాల్‌ సంచలన పోస్ట్‌..! దూరమైతే బంధం విలువ తెలుస్తుందంటూ..


భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతనితో ఉన్న ఒక చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. తాము మళ్లీ తిరిగి కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దూరంగా ఉంటే బంధం విలువ ఏంటో తెలుస్తుందంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. “కొన్నిసార్లు దూరం మీకు బంధం విలువ తెలియజేస్తుంది. మేం మళ్ళీ ప్రయత్నిస్తున్నాం,” అని ఆమె తన భర్తతో కలిసి ఉన్న ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. గత నెలలో సైనా నెహ్వాల్ తన భర్త కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ జంటకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ 2018లో వివాహం చేసుకున్నారు. “జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. చాలా ఆలోచనలు, పరిశీలనల తర్వాత, కశ్యప్ పారుపల్లి. నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం మా కోసం, ఒకరికొకరు శాంతి, పెరుగుదల, స్వస్థతను ఈ మార్గం ఎంచుకుంటున్నాం. జ్ఞాపకాలకు నేను కృతజ్ఞుతరాలిని, ముందుకు సాగడానికి ఉత్తమమైనదాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకుని గౌరవించినందుకు ధన్యవాదాలు” అని నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో పాటు నంబర్ వన్ ర్యాంకింగ్‌ను సాధించడం ద్వారా సైనాను భారత బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగారు. సైనా నెహ్వాల్ 2009లో అర్జున అవార్డును, 2010లో ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్‌లో నిలిచిన ఏకైక భారతీయ మహిళా షట్లర్‌గా ఆమె పేరు ఇప్పటికీ నిలిచి ఉంది. మరోవైపు 2014 కామన్వెల్త్ క్రీడల్లో కశ్యప్‌ బంగారు పతకం గెలుచుకున్నారు. 2010 క్రీడల్లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష షట్లర్‌గా రికార్డు సృష్టించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *