Health Tips: చిన్న పనికే శ్వాస ఆడడం లేదా..? ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు.. వెంటనే..

Health Tips: చిన్న పనికే శ్వాస ఆడడం లేదా..? ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు.. వెంటనే..


చిన్న చిన్న పనులకే బాగా అలసిపోతున్నారా..? కొంత దూరం నడిచిన తర్వాత లేదా మెట్లు ఎక్కిన తర్వాత బాగా ఊపిరి తీసుకుంటున్నారా.? ఇది సాధారణ అలసటకు సంకేతం కాకపోవచ్చు. శరీరం లోపల జరుగుతున్న ఏదైనా తీవ్రమైన సమస్యకు హెచ్చరిక కావచ్చు. కానీ ప్రజలు దీనిని ఏజ్ అయిపోవడం, ఊబకాయం లేదా ఫిట్‌నెస్ లేకపోవడం వంటివి అని అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ అలా లైట్ తీసుకుంటే ప్రమాదకరంగా మారవచ్చు. శ్వాస ఆడకపోవడం అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు. ఊపిరితిత్తులు, గుండె లేదా రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. గుండె శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది. గుండె కండరాలు బలహీనమైనప్పుడు లేదా రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు.. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. గుండె ఆగిపోవడం.. కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె కవాట సమస్యలు శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి.

ఊపిరితిత్తుల రుగ్మతలు

ఆస్తమా, సీవోపీడీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా ఫైబ్రోసిస్ వంటి వ్యాధులు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఊపిరితిత్తులు శరీరానికి తగినంత ఆక్సిజన్‌ను అందించలేనప్పుడు.. వేగంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దుమ్ము, పొగ లేదా చల్లని గాలిలో ఈ లక్షణాలు పెరుగుతాయి.

రక్తహీనత

రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల, తక్కువ ఆక్సిజన్ శరీర భాగాలకు చేరుతుంది. అటువంటి పరిస్థితిలో కొద్దిగా నడవడం కూడా అలసట, శ్వాస ఆడకపోవడానికి కారణమవుతుంది. పురుషుల కంటే స్త్రీలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తుంది.

థైరాయిడ్ – హార్మోన్ అసమతుల్యత

హైపర్ థైరాయిడిజంలో జీవక్రియ వేగంగా మారుతుంది. ఇది హృదయ స్పందనను కూడా పెంచుతుంది. శరీరం త్వరగా అలసిపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చిన్న పనికి కూడా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

ఊబకాయం – డీహైడ్రేషన్

అధిక బరువు ఉండటం వల్ల శరీరం ప్రతి చిన్న పనికి కష్టపడాల్సి వస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడిని పెంచుతుంది. వేగంగా శ్వాస తీసుకోవడానికి కారణమవుతుంది. అదే సమయంలో, శరీరంలో నీరు లేకపోవడం లేదా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత అలసట, శ్వాస సమస్యలను కూడా పెంచుతుంది.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

  • శ్వాస ఆడకపోవడం తరచుగా జరుగుతుంటే
  • నిద్రలో శ్వాస ఆడకపోవడం
  • ఛాతీ నొప్పి, వేగవంతమైన హార్ట్ బీట్
  • దగ్గు లేదా ఛాతీలో పట్టేసినట్లు ఉంటే

అప్పుడు వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లండి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *