పెళ్లై 7 నెలలు.. భార్య 7 నెలల గర్భవతి! మృగంలా మారి.. రూమ్‌ లాక్‌ చేసి అతి కిరాతకంగా..

పెళ్లై 7 నెలలు.. భార్య 7 నెలల గర్భవతి! మృగంలా మారి.. రూమ్‌ లాక్‌ చేసి అతి కిరాతకంగా..


ఈ ఏడాది జనవరిలో ఆ వ్యక్తికి అందమైన అమ్మాయితో పెళ్లైంది. కానీ, ఆర్నెళ్లు తిరగ్గా ముందే తన భార్యను ఆ వ్యక్తి అతికిరాతకంగా హత్య చేశాడు. మరో తీవ్ర విషాదం ఏంటంటే.. ఆ మహిళ 7 నెలల గర్భిణి. ఇంట్లోని ఓ రూమ్‌లో లోపలి నుంచి లాక్‌ చేసి దారుణంగా ఆమెను కత్తితో గొంతుకోసి, పోడిచి చంపాడు. పోలీసులు వచ్చేంత వరకు అదే రూమ్‌లో తన భార్య శవం పక్కన కూర్చోని ఉన్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవిశంకర్ అనే వ్యక్తి తన ఏడు నెలల గర్భవతి అయిన భార్య సప్నను తాళం వేసిన గదిలో చంపి, అతనే పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. సప్న గత ఐదు నెలలుగా అమ్హెరాలోని తన సోదరి ఇంట్లో నివసిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఆమెకు రవి శంకర్‌తో వివాహం అయింది. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగడంతో ఆమె అక్కడికి వెళ్లింది.

శనివారం ఉదయం రవి అమ్హెరా నివాసానికి వచ్చి సప్నతో మాట్లాడాలని కోరాడు. రవి సప్నను మొదటి అంతస్తులోని ఒక గదికి తీసుకెళ్లి తలుపు మూసేశాడు. కొద్దిసేపటి తర్వాత తాళం వేసి ఉన్న గది లోపల నుండి అరుపులు, కేకలు వినిపించాయి. కుటుంబ సభ్యులు, పొరుగువారితో సహా సాక్షులు సప్న తన ప్రాణాల కోసం వేడుకుంటుందని విన్నట్లు చెప్పారు. ఆమె ఎంత వేడుకున్నా రవి ఆమెపై కత్తితో పదే పదే దాడి చేశాడు.

పోలీసుల ప్రకారం.. అతను ఆమె గొంతు కోసి, ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెను అనేకసార్లు పొడిచి చంపాడు. సప్న సోదరి, ఇతరులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే సమయానికి, తలుపు లోపలి నుండి లాక్ చేసి ఉండటంతో వాళ్లు కూడా ఏం చేయలేకపోయారు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టే వరకు ఎవరూ లోపలికి రాలేకపోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి రవిని అదుపులోకి తీసుకున్నారు. రవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సప్న మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *