ఇండోర్‌లో దారుణం..13ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ ఫ్రీ ఫైర్ గేమ్‌!

ఇండోర్‌లో దారుణం..13ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ ఫ్రీ ఫైర్ గేమ్‌!


ఇండోర్‌లో దారుణం..13ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ ఫ్రీ ఫైర్ గేమ్‌!

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి ఆక్లన్ జైన్ (13) ఆన్‌లైన్ ఫ్రీ ఫైర్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసి ఉంది. తన గేమింగ్ ఐడీకి తల్లి డెబిట్ కార్డు లింక్ చేశాడు. గేమ్‌లో రూ.2,800 నష్టపోయిన తరువాత విషయం తల్లికి చెప్పాడు. తల్లి తిడుతుందనే భయంతో బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆక్లన్‌ తాత బాలుడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటం గమనించాడు. ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆక్లన్‌ జైన్‌ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, పోస్ట్‌మార్టం నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు శుక్రవారం మృతుడి ఇంటికి చేరుకుని అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను విచారించారు. దర్యాప్తులో ఆక్లాన్‌ ఫైర్ గేమ్ ఆడేవాడని, అతడు డబ్బు రూ. 2,800 పోగొట్టుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు.

‘ఫ్రీ ఫైర్’లో రూ. 2800 పోగొట్టుకున్న తర్వాత ఆక్లాన్‌ తన తల్లి అపూర్వ జైన్‌కు చెప్పాడు. అమ్మ ఏమంటుందోననే భయంతో ఆ బాలుడు తన స్టడీ రూమ్‌లోకి వెళ్లి లోపలి నుండి గడియ వేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *