Headlines

Watch Video: పందులను ఎత్తుకెళ్తున్న దొంగలు.. సినిమా లెవెల్‌లో ఛేజ్‌ చేసిన పోలీసులు.. చివరకు ఏమైందంటే?

Watch Video: పందులను ఎత్తుకెళ్తున్న దొంగలు.. సినిమా లెవెల్‌లో ఛేజ్‌ చేసిన పోలీసులు.. చివరకు ఏమైందంటే?


మహబూబ్‌నగర్‌ జిల్లాలో పందుల దొంగలు రెచ్చిపోతున్నారు. పందుల పెంపక దారులతో పాటు, పోలీసులను హడలెత్తిస్తున్నారు. గత నెల 30న అర్ధరాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పందుల చోరీతో తీవ్ర కలకలం రేపారు దుండగులు. ఓ పందుల యజమానిపై దాడి చేసి సుమారు 40పందులను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ముఠా వాహనాన్ని వెంబడించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే దొంగలు అక్కడి నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూర్, అమరచింత వైపు వెళ్తున్నట్లు గమనించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రోడ్లపై పందుల దొంగల ముఠా కోసం పోలీసులు కాపు కాచారు. కాసేపటికి పందుల దొంగల ముఠా వాహనం కనపించడంతో వారిని ఛేజ్ చేసేందుకు ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో పోలీసులపై ఖాళీ సీసాలతో దాడికి యత్నించారు. వేగంగా నారాయణపేట వైపు ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వైపు దూసుకెళ్లారు. సినీ ఫక్కిలో పందుల దొంగలను పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: వామ్మో.! ఈ కిలేడికి ఏకంగా 8మంది భర్తలు.. తొమ్మిదో పెళ్లికి రెడీ అవుతుండగా..

అయితే పోలీసులను నిలువరించేందుకు దుండగులు దొంగిలించిన పందులను రోడ్డుకు అడ్డుగా విసురారు. అప్రమత్తమైన పోలీస్‌ వాహనం నడుపుతున్న డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పించుకన్నారు. అయినప్పటికీ పందుల దొంగలను వదలకుండా వారిని పట్టుకునేందుకు వారి వాహనాన్ని ఛేజ్ చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని నిలిపారు దొంగలు. పోలీసుల వాహనం సమీపానికి రాగానే రివర్స్ గేర్ లో వారిని ఢీకొట్టారు. వెంటనే అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఘటనలో అమరచింత పోలీసుల వాహనం ధ్వంసం అయ్యింది. ఇక పందుల దొంగలు అక్కడి నుంచి కర్ణాటక వైపునకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి:  అర్ధరాత్రి రోడ్డుపై రచ్చ చేశారు.. కట్‌చేస్తే.. ఉదయాన్నే…

గత నెల 20వ తేదీన ఆత్మకూరు పట్టణ కేంద్రంలో అర్దరాత్రి ఇదే రకంగా 23 పందులను చోరి చేశారు దుండగులు. చోరి విషయాన్ని సీసీ కెమెరాలో గమనించి దొంగలను వెంబడించగా ఇదే రకంగా వారిపై ఖాళీ సీసాలను విసురుతూ దాడులు చేసి పరారయ్యారు. గడిచిన కొన్ని నెలలుగా ఈ పందుల దొంగల ముఠా రెచ్చిపోతోంది. చోరీలు చేయడం అడ్డు వస్తె విచక్షణారహితంగా దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైన పోలీసులు ఈ దొంగల ముఠా పై గట్టి నిఘా పెట్టి చోరీలను అరికట్టాలని పందుల పెంపకం దారులు కోరుతున్నారు.

దొంగలను పోలీసులు చేజ్‌ చేస్తున్న వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *